Last Updated:

All That Breaths: నిరాశ..’అల్ దట్ బ్రీత్స్’ కి మిస్ అయ్యిన ఆస్కార్..

All That Breaths:ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్ని సినితారలు హాజరయ్యారు.

All That Breaths: నిరాశ..’అల్ దట్ బ్రీత్స్’ కి మిస్ అయ్యిన ఆస్కార్..

All That Breaths: ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినితారలు హాజరయ్యారు.

అల్ దట్ బ్రీత్స్’ కి ఆస్కార్ మిస్..

సినీ అభిమానులు.. ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్కార్ వేడుకలు మొదలు అయ్యాయి. ఆర్ఆర్ఆర్ తో పాట ఆస్కార్ రేస్ లో మరో రెండు సినిమాలు నిలిచిన విషయం తెలిసిందే. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ దట్ బ్రీత్స్ సినిమాలు నామినేషన్స్ లో నిలిచాయి. అయితే అల్ దట్ బ్రీత్స్.. ఆస్కార్ మిస్ అయ్యింది. డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ దట్ బ్రీత్స్ సినిమ నామినేషన్స్ లో నిలిచింది. అయితే అయితే ‘అల్ దట్ బ్రీత్స్’ చివర్లో ఆస్కార్ ని మిస్ చేసుకుంది. దీనితో పాటు రేస్ లో ఉన్న మరో డాక్యుమెంటరీ ‘నవల్నీ’ ఆస్కార్ గెలుచుకుంది. ఈ డాక్యుమెంటరీ ఫిలిం రష్యన్ లీడర్ ‘అలెక్సీ నవల్నీ’ జీవిత ఆధారంగా తెరకెక్కించారు. డానియెల్ రోహెర్ ఈ పొలిటికల్ డాక్యుమెంటరీని చిత్రీకరించాడు. ఈ ఫిలిం క్రిటిక్స్ ఛాయస్ అవార్డు, BAFTA అవార్డు కూడా అందుకుంది.

ఆల్ దట్ బ్రీత్స్ కథ ఇదే..

ఇక మన ఇండియన్ ఫిలిం ‘అల్ దట్ బ్రీత్స్’ కథ ఇది. ఢిల్లీ వజీరాబాద్‌లో బర్డ్ క్లినిక్‌ను నడుపుతున్న నదీమ్ షెజాద్, మహ్మద్ సౌద్ అనే ఇద్దరు సోదరుల కథ. ఇక్కడ గత 20 సంవత్సరాలుగా ఎన్నో పక్షులకి వైద్యం చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యం, గాలిపటాలు, రకరకాల పరిస్థితులతో పక్షులు తగ్గిపోతున్నాయి. అంతేకాక అవి వివిధ సమస్యలతో బాధపడుతున్నాయి. అలాంటి పక్షులకు వైద్యం చేయడం, పక్షులు, మనుషుల మధ్య బంధాన్ని చూపించడమే ఈ సినిమా సారాంశం. ఈ సినిమాని షౌనక్ సేన్ తెరకెక్కించాడు. ఈ ఫిలిం అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు గెలుచుకుంది.

ఈ ఆస్కార్ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీతారలు హాజరయ్యారు. అమెలికాలోని లాస్ ఎంజెల్స్ లో ఈ వేడుక అట్టహాసంగా సాగుతోంది. ఇప్పటికే పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను ప్రకటించారు.ఆస్కార్ అవార్డుల వేడుకలో బాలీవుడ్ కథనాయిక దీపిక పదుకొణె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ని ఆమె ఆస్కార్ వేడుకలో పరిచయం చేశారు. ఆ పాట నేపథ్యాన్ని ఈ వేడుకకు హాజరైన వారికి వివరించారు. ఈ వేడుకకుప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.