Pawan’s Son Mark Health Update: మరో మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే మార్క్ శంకర్.. తారక్ ట్వీట్!

Pawan Kalyan Son Mark Shankar Health Update: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. ఈ విషయంలో పవన్ అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక కొడుకుని చూసేందుకు పవన్ సింగపూర్ వెళ్లారు. తాజాగా మార్క్ శంకర్ హెల్త్ అప్‌డేట్ వచ్చింది. అతడిని అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డు తరలించారు. అయితే మరో మూడు రోజుల పాటు మార్క్ శంకర్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచి, పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇక మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడని తెలిసి పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ఆయన ఫోన్ చేసి పరామర్శించారు.
ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్
ప్రధాని మోదీతో ప్రత్యేకంగా ఫోన్ చేసి మార్క్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అలాగే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్క్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. తాజాగా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం మార్క్ ప్రమాదంపై స్పందించారు. ఇదిలా ఉంటే మార్క్ ప్రమాదంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్పందించారు. ధైర్యం ఉండు లిటిల్ వారియర్ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. “సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ చిక్కుకున్నాడని తెలిసి ఎంతో బాధపడ్డాను. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్. పవన్ కళ్యాణ్, అతడి కుటుంబ సభ్యులకు బలం చేకూరాలి” అని ట్విటర్ వేదికగా తారక్ ఆకాంక్షించాడు.
Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.
— Jr NTR (@tarak9999) April 9, 2025
స్కూల్లో అగ్ని ప్రమాదం
సమ్మర్ క్యాంప్ ఉండగా స్కూల్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్టు మంగళవారం జరిగిన ప్రెస్‌లో పవన్ స్వయంగా చెప్పారు. ఈ ప్రమాదంలో మార్క్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. అలాగే మార్క్ ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని తెలిపారు. అయితే అరకు పర్యటన అనంతరం ఆయన మంగళవారం రాత్రి నేరుగా సింగపూర్ బయలుదేరి తనయుడిని చూశారు. సమ్మర్ క్యాంప్‌లో భాగంగా మార్క్ శంకర్ కుకింగ్ క్లాసెస్‌లో జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలో యదావిధిగా మంగళవారం స్కూల్ వెళ్లాడు.
అదే సమయంలో రివర్ వాలి రోడ్ షాప్ హౌజ్‌అనే అపార్టుమెంటులోని మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అదే సమంయలో రెండవ అంతస్తులోని మార్క్ ఉన్న టమాటో స్కూల్లోకి పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారి ఊపిరి ఆడక మరణించింది. మరో 19 మంది పిల్లలు ప్రమాదం నుంచి బయటపెడ్డారు. ఈ సంఘటనలో మార్క్ ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో స్వల్ప అస్వస్థకు గురయ్యాడు. దీంతో హుటాహుటిన మార్క్‌ను ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించారు. ప్రస్తుతం మార్క్ ఆరోగ్యం నిలకడ ఉందని వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- Manchu Family Controversy: మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ వివాదం – జల్పల్లి నివాసం వద్ద మనోజ్ ఆందోళన!