Published On:

#NTRNeel Movie Update: ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీ.. ఆ సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ వచ్చేసిందోచ్‌..!

#NTRNeel Movie Update: ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీ.. ఆ సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ వచ్చేసిందోచ్‌..!

Jr NTR  Joins #NTRNeel Movie Shooting from April 22nd: అంతా ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్‌ వచ్చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌నీల్‌(#NTRNeel) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీని ప్రకటించారు. గతేడాది పూజ కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్‌ అయిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వచ్చింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ ప్రారంభించాడు ప్రశాంత్‌ నీల్‌.

 

యాక్షన్‌ షూరు..

అయితే ఎన్టీఆర్‌ లేకుండానే షూటింగ్‌ని ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి మంగళవారం(ఏప్రిల్‌ 8) ఓ సర్‌ప్రైజ్ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. బుధవారం (ఏప్రిల్‌ 9న) మధ్యాహ్నం 12:06 గంటలకు NTRNeel నుంచి ఓ బిగ్‌ అప్‌డేట్‌ ఇవ్వనున్నట్టు మూవీ టీం పేర్కొంది. చెప్పినట్టుగా మేకర్స్‌ ఆ అప్‌డేట్ వదిలి ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చారు. ఎన్టీఆర్‌ సెట్స్‌లో జాయిన్‌ కాబోతున్నాడంటూ గుడ్‌న్యూస్‌ చెప్పారు.

 

ఏప్రిల్ 22న ‘డ్రాగన్’ ఎంట్రీ..

ఏప్రిల్‌ 22 నుంచి తారక్‌ మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నాడని మేకర్స్‌ ప్రకటన ఇచ్చారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు’ మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో నందమూ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక వేట మొదలైంది, యాకన్ షూరు అంటూ తెగు సంబరపడిపోతున్నారు. కాగా ఈ సినిమా డ్రాగన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు ముందు నుంచి ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే.

 

కాగా ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రవి బస్రూర్‌ సంగీతం అందించనున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని సమాచారం. ఇక ఈ చిత్రానికి డ్రాగన్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఇక ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ని ఎన్టీఆర్‌ లేకుండానే మొదలు పెట్టాడు ప్రశాంత్‌. సెకండ్‌ షెడ్యూల్‌ని వికారాబాద్‌ అడవుల్లో ప్లాన్‌ చేశాడట. ఇందులో సప్త సాగరాలు ఫేం, కన్నడ నటి రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తోందనే టాక్‌ గట్టిగా వినిపిస్తోంది.