Tollywood Stars with Own Private Jets: మన హీరోల లగ్జరీ లైఫ్.. కోట్లు విలువ చేసే సొంత విమానాలు ఉన్న స్టార్స్ వీళ్లే!

Tollywood Stars Who Have Own Private Jets Worth Crores: ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు హీరోలంత పాన్ ఇండియా అంటూ పరుగులు పెడుతున్నారు. దీంతో రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌లో తీసుకుంటున్నారు. ఒకప్పుడు 20 నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకునే హీరోలు ఇప్పుడు వందల కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. ఇక వారి లైఫ్‌స్టైల్ కూడా మరింత లగ్జరీ మారింది. దీంతో స్టార్ హీరోల లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు సాధారణ ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
భారీ పారితోషికం… లగ్జరీ లైఫ్ స్టైల్
ముఖ్యంగా తమ అభిమాన నటీనటులు ఎలా ఉంటారు, ఏం చేస్తుంటారనేది తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తుంటారు. ఇక వారి లగ్జరీ లైఫ్ చూసి ఆశ్చర్యపోతుంటారు. వారు ఎక్కడికి వెళ్లిన, ఏం చేసిన చూట్టూ వందల మంది.. ఎప్పుడు ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. ఇక సినిమా షూటింగ్ కోసం ఎప్పుడు.. ఎక్కడ ఉంటారనేది వారికే తెలియదు. తరచూ విదేశాలకు వెకేషన్ కి వెళుతుంటారు. ఈ క్రమంలో వారు పబ్లిక్ ఎయిర్‌లైన్ సర్వీసుల్లో ప్రయాణించడం కష్టం. అందుకే స్టార్ హీరోలంతా సొంతంగా ప్రైవేట్ జెట్ ప్లైయిట్స్ కోని అందులో ప్రయాణిస్తుంటారు.
ఒకప్పుడు ఈ ప్రైవేట్ జెట్స్ కేవలం కుబేరులైన వ్యాపారవేత్తలకు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం ఇప్పుడు వ్యాపారవేత్తలతో పాటు పలువురు సినీ స్టార్ హీరోలు కూడా కోనుగోలు చేశారు. బాలీవుడ్‌లో అభితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్‌లతో పాటు పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లకు వేల కోట్లు విలువ చేసే ప్రత్యేకమైన విమానాలు ఉన్నాయి. ఇక మన సౌత్ హీరోల్లో చాలా తక్కువ మంది సొంతంగా విమానాలు ఉన్నాయనే విషయం తెలుసా? ఇంతకి వారెవరూ. ఎవరెవరికి ప్రైవేట్ జెట్స్ ఉన్నాయో ఇక్కడ చూద్దాం!
డార్లింగ్ వెయ్యి కోట్ల ప్రైవేట్ జెట్
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా నెంబర్ వన్ స్థానంలో ఉన్న ప్రభాస్‌కి సొంతంగా లగ్జరీ ప్రైవేట్ జెట్ ఉంది. సుమారు వెయ్యి కోట్ల పైనే దీని విలువ ఉంటుందని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. ప్రస్తుతం అతడి ఉన్నవన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్సే. ఒకేసారి మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తున్న ప్రభాస్ షూటింగ్ నిమిత్తం ఈ ప్రత్యేక విమానంతో తరచూ ఇతర ప్రాంతాలకు జర్నీ చేస్తుంటాడట. అలాగే వెకేషన్స్‌కి కూడా ఈ ప్లయిట్‌లోనే వెళుంటాడు.
రామ్ చరణ్‌కు ట్రూ జెట్
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో గ్లోబల్ రేంజ్‌కి ఎదిగాడు రామ్ చరణ్. టాలీవుడ్‌లో అత్యధిక పారితోషిక తీసుకునే హీరో ఆయన ఒకడు. ప్రస్తుతం వందకోట్లపైనే రెమ్యునరేషన్ అందుకుంటున్న చరణ్‌కు ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. అంతేకాదు ఆయన సొంతంగా ట్రూజెట్ అనే డొమాస్టిక్ విమానయాన సంస్థ ఉన్న విషయం తెలిసిందే. ఎంతో సౌకర్యవంతమైన ఈ ప్రైవేట్ జెట్‌లో తరచూ ఆయన తన భార్య ఉపాసన, ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తుంటాడు. కుటుంబంతో కలిసి సరదాగా విదేశాలకు వెకేషన్ వెళ్లినప్పుడు ఈ ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తుంటాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి సొంతంగా ప్రవేట్ జెట్ ఉంది. దీనిని ఎక్కువగా చిరు తన షూటింగ్స్ కోసం వాడుతుంటారు. అలాగే తన భార్య సురేఖ, కూతుళ్లతో కలిసి వెకేషన్ వెళ్లేందుకు ఈ ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తుంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు
టాలీవుడ్ అగ్ర హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే ఆయనకు కూడా సొంతం విమానం ఉంది. ఇందులో తరచూ తన ఫ్యామిలీతో కలిసి టూర్లు వేస్తుంటాడు. అలాగే షూటింగ్స్ కోసం ఇతర ప్రాంతాలకు, విదేశాలకు ఈ ప్రైవేట్ జెట్‌లో వెళుతుంటాడు.
జూనియర్ ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు కూడా సొంతంగా విమానం ఉంది. దీని ఖరీదు ఎనిమిది కోట్లు ఉంటుందని సమాచారం. ఈ ప్రైవేట్ జెట్‌లో ఫ్యామిలీతో వెకేషన్స్, షూటింగ్స్‌కి వెళుతుంటాడు. ఇక తారక్‌కి కూడా లగ్జరీ కార్లు అంటే మక్కువ ఎక్కువ అనే విషయం తెలిసిందే. ఇప్పటికే తన కార్ల గ్యాలరీలో బీఎండబ్య్లూ, లంబోర్గినితో పాటు పలు లగ్జరీ బ్రాండ్ కార్లు ఉన్నాయి.
అల్లు అర్జున్
అల్లు అర్జున్‌కి కూడా సొంతంగా ప్రత్యేక విమానం ఉంది. ఇది సీక్స్ సీటర్ లగ్జరీ జెట్. దీని విలువ వందల కోట్లు ఉంటుందని సమాచారం. ఈ ప్రైవేట్ జెట్ భార్య స్నేహరెడ్డితో పెళ్లి తర్వాత కోనుగోలు చేశాడట. తరచూ ఇందులోనే బన్నీ వెకెషన్స్‌కి వెళుతుంటాడు. ఇక బన్నీ లగ్జరీ క్యారవాన్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. తన అభిరుచికి తగ్గట్టుగా ఈ క్యారవాన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాడు. అల్లు అర్జున్(AA) బ్రాండ్ లోగోతో ఈ క్యారవాన్ ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. అలాగే నాగార్జున అక్కినేని, నాగచైతన్యతో పాటు కోలీవుడ్ హీరోలు సూపర్ స్టార్ రజనీకాంత్, దళపతి విజయ్, హీరోయిన్ నయనతారకు కూడా సొంతంగా ప్రైవేట్ జెట్ ఉంది.