Published On:

NTR New Look: ఎన్టీఆర్ కొత్త లుక్.. అభిమానులను కంగారు పెట్టించేలానే ఉందే!

NTR New Look: ఎన్టీఆర్ కొత్త లుక్.. అభిమానులను కంగారు పెట్టించేలానే ఉందే!

NTR New Look got Viral: సాధారణంగా హీరోలు.. ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ లో కనిపిస్తారు. డైరెక్టర్ చెప్పిన కథను బట్టి.. దానికి ఏ లుక్ అయితే సెట్ అవుతుందో.. ఆ లుక్ కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు ఆ లుక్ వచ్చేవరకు నిద్రపోరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. బరువు పెరగడం, తగ్గడం.. జుట్టు పెంచడం, గుండు చేయించుకోవడం.. వీరికి చిన్న విషయాలు. లుక్ సరిగ్గా రావడం కోసం ఎంతకైనా తెగిస్తారు. పెద్ది కోసం చరణ్, SSMB29 కోసం మహేష్ బాబు.. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఇలా కండలు పెంచినవారే.. జుట్టు కూడా పెంచినవారే.

 

ఇక ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లుక్ కూడా కచ్చితంగా ప్రశాంత్ నీల్ సినిమా కోసమే అని తెలుస్తోంది. దేవర సినిమాలో రెండు పాత్రలు దేవర, వర. కొరటాల శివ కథ చెప్పినప్పుడే తండ్రీకొడుకుల మధ్య వ్యత్యాసం కనిపించాలని చెప్పాడట. అందుకే దేవర కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్.. వెంటనే వర కోసం బరువు తగ్గి కనిపించాడు. దేవర లో ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది కూడా.

 

ఇక దేవర తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం వార్ 2. బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎన్నో ఏళ్ళు ఎదురుచూసిన ఎన్టీఆర్.. ఎట్టకేలకు హృతిక్ రోషన్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటూ వార్ 2 తో హిందీ మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా కోసం కూడా ఎన్టీఆర్ లుక్ లో ఏ మార్పు లేదు. అయితే ఈ మధ్యనే ఎన్టీఆర్ లుక్ లో చాలా పెద్ద మార్పులే వచ్చాయి. మనిషి పూర్తిగా తగ్గిపోయి కనిపించాడు.

 

మొన్నటికి మొన్న మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో  ఎన్టీఆర్ ను చూసినప్పటి నుంచి అభిమానుల్లో కంగారు మొదలయ్యింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా ఎన్టీఆర్.. తన భార్య ప్రణతితో కలిసి  డైరెక్టర్ వంశీ పైడిపల్లి భార్య మాలినీ పైడిపల్లి బర్త్ డే సెలబ్రేషన్స్ లో సందడి చేశారు. ఎన్టీఆర్ తో పాటు ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ, సుకుమార్ ఫ్యామిలీ కూడా అటెండ్ అయ్యాడు. వీరందరూ కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ఇందులో ఎన్టీఆర్ లుక్ అభిమానులను మరింత కంగారుపెడుతోంది.

 

అసలు చీపురుపుల్లలా బక్కచిక్కి ఎన్టీఆర్ కనిపించాడు. సడెన్ గా ఎన్టీఆర్ ను చూస్తే  ఒకప్పుడు కంత్రీ సినిమాలో ఎలా ఉన్నాడో అలా కనిపిస్తున్నాడు. అయితే ఇది కేవలం సినిమా కోసం అయితే పర్లేదు. కానీ, ఆరోగ్య సమస్యల వలన ఏదైనా అయ్యిందా.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా అయినా కూడా మరీ ఈ రేంజ్ గా తగ్గాల్సిన క్యారెక్టర్ కాదేమో అన్న సందేహాలు కూడా మొదలయ్యాయి. మరి ఎన్టీఆర్ లుక్ వెనుక మతలబు ఏంటి అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.