Published On:

#NTRNeel Update: ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీ నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. మాస్ జాతర!

#NTRNeel Update: ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ మూవీ నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. మాస్ జాతర!

A Big Update Came from NTRNeel Movie: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ 32 సినిమాగా ఇది రూపొందుతోంది. అనౌన్స్‌మెంట్‌తోనే ఈ మూవీ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఎప్పుడో మూడేళ్ల క్రితమే ఈ సినిమాను ప్రకటించారు. స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుని గతేడాది పూజ కార్యక్రమంతో గ్రాండ్‌ లాంచ్‌ అయ్యింది. దీంతో ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడెప్పుడు వస్తుందా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ఒకవైపు సలార్‌ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రశాంత్‌ నీల్‌ ఎన్టీఆర్‌ మూవీ షూటింగ్‌ని ఎప్పుడెప్పుడు స్టార్ట్‌ చేస్తాడా..? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి ఎండింగ్‌లో మూవీ షూటింగ్‌ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఎన్టీఆర్‌నీల్‌ షూటింగ్‌ మొదదలైంది. ఇందుకోసం ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ప్రత్యేకంగా సెట్‌ వేసి షూటింగ్‌ జరిపారు. సెట్స్‌లోని ప్రశాంత్‌ నీల్‌ మైక్‌ పట్టుకుని యాక్షన్ చెబుతన్న ఫోటోను షేర్‌ చేసి షూటింగ్‌ మొదలైనట్టు తెలిపారు. ఇక మార్చిలో జరిగిన షెడ్యూల్‌ నుంచి ఎన్టీఆర్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

 

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్‌ అప్‌డేట్ ఇచ్చింది. రేపు ఈ మూవీ నుంచి ఓ బిగ్‌ అప్‌డేట్‌ రానుందని మేకర్స్‌ సైలెంట్‌ ఓ పోస్ట్‌ వదిలారు. ఏప్రిల్‌ 9న మధ్యాహ్నం 12.06 గంటలకు ఈ చిత్రం నుంచి బిగ్‌ సర్‌ప్రైజ్‌ రానుందని పేర్కొంది. దీంతో ఈ సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఏంటా అని అంచనాలు వేసుకుంటున్నారు. ఎలాంటి అప్‌డేట్‌ అయ్యింటుందని, తారక్‌ ఫస్ట్‌ లుక్‌ రివీల్‌ చేయబోతున్నారా..? అంటూ అభిమానులంతా అంచనాలు వేసుకుంటున్నారు. ఏదేమైన రేపు వచ్చే అప్‌డేట్‌ కోసం మాత్రం ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

 

 

కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగనుంది. కేజీయఫ్‌, సలార్‌ తరహాలో సాగనుంది. ఇక ఈ చిత్రానికి డ్రాగన్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఇక ఫస్ట్‌ షెడ్యూల్‌ని ఎన్టీఆర్‌ లేకుండానే మొదలు పెట్టాడు ప్రశాంత్‌. సెకండ్‌ షెడ్యూల్‌ని వికారాబాద్‌ అడవుల్లో ప్లాన్‌ చేశాడట. మార్చిలో జరిగిన ఈ షెడ్యూల్‌ ఎన్టీఆర్‌ పాల్గొన్నట్టు సమాచారం. ఈ సినిమాలో సప్త సాగరాలు ఫేం, కన్నడ నటి రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తోందనే టాక్‌ గట్టిగా వినిపిస్తోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందించనున్నారు.