Kalyan Ram on Jr NTR New Look: ఎన్టీఆర్‌కు ఏమైంది..? ఎందుకు అలా సన్నబడ్డారు: తారక్ ఆరోగ్యంపై కళ్యాణ్ రామ్ క్లారిటీ!

Kalyan Ram Key Comments on Jr NTR New Look: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొత్త లుక్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. మొన్నటి మంచి ఫిట్‌నెస్‌తో హెల్తీగా కనిపించిన తారక్.. ఇటీవల బక్కచిక్కిపోయారు. ఆయనను ఇలా అభిమానులంతా తారక్‌కు ఏమైందని కంగారు పడుతున్నారు. ఇటీవల సుకుమార్ భార్య తబిత బర్త్‌డే పార్టీలో, ఇటీవల మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్‌లో, కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ అలా అంతా షాక్ అయ్యారు.
అయితే ఆయన సడెన్ ట్రాన్స్‌ఫర్మెషన్‌కి కారణమేంటి, ఎందుకు అంతగా బక్కి చిక్కిపోయారు, ఏమైనా అనారోగ్యం సమస్యలా? అభిమానుల్లో రకరకాల సందేహాలు మొదలయ్యాయి. అయితే తాజాగా తారక్ అరోగ్యంపై కళ్యాణ్ రామ్ స్పందించారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్య్వూలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కళ్యాణ్ రామ్‌ను ఎన్టీఆర్ ఆరోగ్యంపై ప్రశ్నించారు. ఆయన ఎందుకు అంతలా సన్నబడ్డారు? మీరేమైన సలహా ఇచ్చారా? అని అడిగారు.
దీనికి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. “ప్రస్తుతం తారక్ ఓ సూపర్ స్టార్. తన మార్కెట్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. దేశంలోనే అగ్ర దర్శకులతో కలిసి పని చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. వాళ్లిద్దరికి నేను సలహాలు, సూచనలు ఇస్తానా? నేను, తారక్ ఏం చేసిన అది సినిమా కోసమే. మూవీ మంచి అవుట్ వచ్చేందుకు, అభిమానులను అలరించేందుకు మేము ఏమైనా చేస్తాం, ఎంత దూరమైన వెళతాం” అని చెప్పుకొచ్చాడు. ఇక కళ్యాణ్ రామ్ మాటలు విని ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ ఇంతా సన్నబడ్డారని కళ్యాణ్ రామ్ పరోక్షంగా హింట్ ఇచ్చేసాడు. అయితే ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలంటే కండలు తిరిగి బలిష్టంగా ఉంటారు.
కానీ డ్రాగన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందులో హీరో బక్కచిక్కిన ఆకారంలో ఉండాలని చెప్పడంతో సినిమా కోసం తారక్ ఇలా సన్నబడ్డారు. ఇందుకోసం కఠిమైన డైట్ ఫాలో అయ్యాడట. భిన్నమైన వర్క్‌అవుట్ రోటిన్ అనసరించి అతి తక్కువ కాలంలో ఇలా ట్రాన్స్‌ఫాం అయ్యారట. ఇక ఎన్టీఆర్ డెడికేషన్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు ప్రచారం ఉంది. ఇప్పికే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించారు. ఇక సెకండ్ షెడ్యూల్ నుంచి తారక్ జాయిన్ కాబోతున్నాడు. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టనున్నాడని ఇటీవల మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. మరో ఎన్టీఆర్ వార్ 2 సినిమా చేస్తున్నాడు. చూస్తుంటే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- Hit 3 Trailer Breaks RRR Record: రాజమౌళి షాకిచ్చిన హిట్ 3 ట్రైలర్.. బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్!