Published On:

Kalyan Ram-Jr NTR: అన్న కోసం తమ్ముడు – ‘అర్జున్‌ S/O వైజయంతి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి జాతరే!

Kalyan Ram-Jr NTR: అన్న కోసం తమ్ముడు – ‘అర్జున్‌ S/O వైజయంతి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి జాతరే!

Jr NTR to Attends Arjun S/O Vyjayanthi Pre Release Event: నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌, ‘మేజర్‌’ ఫేం సయీ మంజ్రేకర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అర్జున్‌ S/O వైజయంతి’. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం లేడీ సూపర్‌ విజయశాంతి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 18న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్‌, పాటలు టీజర్‌ బాగా ఆకట్టుకున్నాయి. ఇక నిన్న చిత్తూరులో జరిగిన ఈవెంట్‌లో సెకండ్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు.

 

ఈ సందర్భంగా ‘అర్జున్‌ S/O వైజయంతి’ టీం తిరుమల శ్రీవారి దర్శించుకుంది. హీరో కళ్యాణ్‌ రామ్‌, విజయశాంతితో పాటు ఇతర చిత్ర బృందం సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్‌ రామ్‌ మీడియాతో మాట్లాడుతూ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే అప్‌డేట్‌ ఇచ్చాడు. ఈ సినిమా మదర్‌ సెంటిమెంట్‌తో సాగుతుందని, ప్రతి ఒక్కరి తమ చిత్రం నచ్చుతుందని నమ్ముతున్నాన్నన్నారు. తల్లి ప్రాముఖ్యత ఏంటో ఈ సినిమాలో ఉంటుందన్నారు. తమ చిత్రం విడుదలకు ముందు శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నామని చెప్పారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటే తప్పకుండ బాబాయ్‌తో కలిసి నటిస్తామని పేర్కొన్నారు. అనంతరం తమ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గురించి చెప్పారు.

 

“ఏప్రిల్‌ 12న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. మా సినిమా ప్రమోషన్స్‌లో తమ్ముడు (జూనియర్‌ ఎన్టీఆర్‌) భాగం అవుతున్నాడు. ఈ కార్యక్రమానికి తమ్ముడు చీఫ్‌ గెస్ట్‌గా వస్తున్నాడు. మీ అందరితో ఆరోజు తప్పుకుండ మాట్లాడతాను. మిరిన్ని విశేషాలను ఆరోజు మాట్లాడుకుందాం” అని చెప్పుకోచ్చాడు. ఇక ‘అర్జున్‌ S/O వైజయంతి’ ఎన్టీఆర్‌ చీఫ్‌ గెస్ట్‌గా వస్తున్నాడని చెప్పడంతో అభిమానులంతా పూనకాలతో ఊగిపోతున్నారు. ఆ రోజు ‘అర్జున్‌ S/O వైజయంతి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో జాతరే అంటూ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.