Ram Charan: కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్ చరణ్! – అసలేం జరిగిందంటే..

Ram Charan and Actor Satya Funny Moments: యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. రేపు (ఏప్రిల్ 11) ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకు సపోర్టు చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముందుకు వచ్చారు. ఈ చిత్ర తొలి టికెట్‌ను ఆయన కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ స్వయంగా వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిని టీం కలవడం, ఆ తర్వాత టికెట్ కొన్న వీడియోను తాజాగా మూవీ టీం షేర్ చేసింది.
ఇందులో కమెడియన్ సత్య, చరణ్ ఆటపట్టించిన పట్టించిన తీరు చాలా సరదగా ఉంది. ఇంతకి ఏం జరిగిందంటే.. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రదీప్ టెన్షన్ పడుతూ కనిపించాడు. అప్పుడే కమెడియన్ సత్య ఎంట్రీ ఇచ్చి.. ఎంటీ అర్జెంట్‌గా రమ్మన్నావ్.. ఇంట్లో పుస్తకం చదువుకుంటుంటే అంటూ అసహనం చూపిస్తాడు. మన సినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11న రిలీజ్ అవుతుంది.. ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఓ స్టార్ చేతిలో పెట్టాలి అని ప్రదీప్ అంటాడు.
దానికి సత్య.. రేపే మహేష్ బాబు, ప్రభాస్ షూటింగ్ అంటూ తననే అంటున్నట్టు ఫీల్ అవుతుంటాడు. వెంటనే ప్రదీప్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (పెద్ది) ఆయన చేతిలో వెళ్లాలి అంటాడు. దీనికి సత్య.. రామ్ చరణ్ తనకు చాలా క్లోజ్ అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత చరణ్ వచ్చి.. ప్రదీప్‌ని పలకరిస్తాడు. కానీ సత్యని మాత్రం ఈ అబ్బాయి ఎవరు అని తెలియదన్నట్టు ప్రవర్తిస్తాడు. చివరకు చరణ్.. హాయ్ సత్య అని గుర్తు పట్టినట్ట చేస్తాడు.
నా కర్థమైంది సార్.. మీరు నా నుంచి పద్దతి కోరుకుంటున్నారు. సరే లే రేపు టైంకి పెద్ది షూటింగ్ వచ్చేయ్ అంటాడు. ఆ తర్వాత సత్య చరణ్ కాళ్లు మొక్కేందుకు వంగడంతో.. రామ్ చరణ్ కూడా సత్య కాళ్లు మొక్కినట్టుగా వంగుతాడు. ఆ తర్వాత సరదాగా సత్యకు చేతులు జోడిస్తాడు. అలా సరదగా సాగిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇక చరణ్ సింప్లిసిటీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గ్లోబల్ స్టార్ అయ్యిండు చిన్న స్టార్స్‌తో ఎంతబాగా కలిసిపోతున్నారంటూ చరణ్ సిప్లిసిటిని కొనియాడుతున్నారు.