Last Updated:

Farmer suicides: జగన్ సీఎం అయ్యాక రైతు ఆత్మహత్యలు పెరిగాయి.. కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్

ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాక రైతు ఆత్మహత్యలు పెరిగాయా? అంటే అవుననే అంటోంది కేంద్రం

Farmer suicides: జగన్ సీఎం అయ్యాక రైతు ఆత్మహత్యలు పెరిగాయి.. కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్

Farmer suicides: ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాక రైతు ఆత్మహత్యలు పెరిగాయా? అంటే అవుననే అంటోంది కేంద్రం. సీఎం జగన్ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. జగన్ సీఎం అయ్యాక ఎక్కువమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానమిచ్చారు.

కర్నాటక, మహారాష్ట్ర (మహారాష్ట్ర) తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీ హయాంలో 2017లో 375 మంది, 2018లో 365 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2019లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తోమర్ వివరించారు.తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. 2017లో తెలంగాణలో 846 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2021 నాటికి రైతుల ఆత్మహత్యలు 352కి తగ్గుతాయని తోమర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి: