SRH vs DC IPL 2025: ఢిల్లీతో మ్యాచ్ రద్దు, ప్లేఆఫ్స్ కు దూరమైన హైదరాబాద్

SRH vs DC IPL 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలపై నీళ్లుచల్లింది వర్షం. సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడగా వర్షం కారణంగా రద్దు అయింది. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. 13పాయింట్లతో ఢిల్లీ ఆరోస్థానానికి చేరుకుంది. హైదరాబాద్ 7పాయింట్లతో ప్లేఆఫ్స్ నుంచి దూరమైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న హైదరాబాదీ కెప్టెన్ కమిన్స్ మొదటి ఓవర్ లోని మొదటి బంతికే వికెట్ తీశాడు. ఆ తర్వాత మూడో ఓవర్, ఐదో ఓవర్లలో కీలకమైన వికెట్లు తీసి ఢిల్లీని కంట్రోల్ చేశాడు. నిర్ణి 20 ఓవర్లలో ఢిల్లీ 7వికెట్ల నష్టానికి 133పరుగులు చేసింది.

srh vs dc ipl 2025 cancelled due to rain in hyderabad uppal stadium
134పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభమవుతుందనుకున్న తరుణంలో బరిలోకి వరణుడు వచ్చాడు. గంటకు పైగా తన ప్రతాపాన్ని చూపడంతో మ్యాచ్ టై అయింది. ఫలితంగా హైదరాబాద్ ఫ్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. కమిన్స్ 3 వికెట్లు తీయగా, ఉనద్కత్ , హర్షల్ పటేల్ , ఇషాన్ మలింగ చెరో వికెట్ తీశారు. కమిన్స్ ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఢిల్లీ ఓపెనర్లు నాయర్ డక్ అవుట్ అవగా, డుప్లెసిస్ 3, పోరెట్ 8పరుగులకే పెవిలియన్ చేరారు. ట్రిస్టస్ స్టబ్స్ 36బంతుల్లో 41నాటౌట్ గా నిలవగా, అశుతోష్ శర్మ 26బంతుల్లో 41 పరుగులు చేయడంతో ఢిల్లీ చెప్పుకోదగ్గస్కోరు చేసింది.
మొదటి ఇన్నింగ్స్ పూర్లయి, విరామం సమయంలో వర్షం మొదలైంది. దాదాపు గంటపాటు కురిసిన వర్షానికి మైదానం చిత్తడైంది. గ్రౌండ్ మెన్స్ ఎంత శ్రమించినా లాభం లేకపోయేసరికి మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్లు లభించాయి. ఢిల్లీ 13పాయింట్లతో ఐదవ స్థానానికి చేరుకోగా, సన్ రైజర్స్ 7 పాయింట్లతో ఎనిమిదవ స్థానానికి పరిమితమై ఫ్లే ఆఫ్స్ ఆశలను కోల్పోయింది.
Delhi : కరుణ్ నాయర్ (సి) ఇషాన్ (బి) కమిన్స్ 0; డుప్లెసిస్ (సి) ఇషాన్ (బి) కమిన్స్ 3; పోరెల్ (సి) ఇషాన్ (బి) కమిన్స్ 8; రాహుల్ (సి) ఇషాన్ (బి) ఉనద్కత్ 10; అక్షర్ (సి) కమిన్స్ (బి) హర్షల్ 6; స్టబ్స్ 41 నాటౌట్; విప్రాజ్ రనౌట్ 18; అశుతోష్ (సి) మనోహర్ (బి) ఇషాన్ మలింగ 41; స్టార్క్ 1 నాటౌట్; ఎక్స్ట్రా లు 5;
20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు;
Bowling: కమిన్స్ 4-0-19-3; ఉనద్కత్ 4-0-13-1, హర్షల్ 4-0-36-1; ఇషాన్ మలింగ 4-0-28-1; అన్సారి 3-0-30-0; అభిషేక్ 1-0-5-0