Last Updated:

Vasantha Nageswara rao: సీఎం జగన్ కమ్మవర్గానికి అన్యాయం చేస్తున్నారు.. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు

కమ్మ వర్గానికి ఎపీ ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేస్తున్నారని, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తాను ఓడిపోయినప్పటికి ఆప్కాబ్ ఛైర్మన్ ఇచ్చారని, అదే విధంగా ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రులుగా బాధ్యతలు అప్పగించారని అన్నారు.

Vasantha Nageswara rao: సీఎం జగన్ కమ్మవర్గానికి అన్యాయం చేస్తున్నారు.. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు

Andhra Pradesh: కమ్మ వర్గానికి ఎపీ ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేస్తున్నారని, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తాను ఓడిపోయినప్పటికి ఆప్కాబ్ ఛైర్మన్ ఇచ్చారని, అదే విధంగా ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రులుగా బాధ్యతలు అప్పగించారని అన్నారు. వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ ప్రస్తుతం మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

జగ్గయ్యపేటలో కాకతీయ సేవా సమితి నిర్వహించిన వన సమారాధనలో పాల్గొన్న వసంత నాగేశ్వరరావు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏపీ కేబినెట్‌లో కమ్మ వర్గానికి చెందిన మంత్రి లేకపోవటం ఏంటని నిలదీశారు. రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్ పేర్లతో అనేకం ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అయితే గతంలో ఏ ప్రభుత్వం వారి పేర్లను మార్చే ప్రయత్నం చేయలేదన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చినా కూడ కమ్మ కులస్తులు స్పందించలేదన్నారు.

తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీలో కమ్మ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత లభిస్తుందని, ఈ విషయం కాస్త సంతోషించ తగిన పరిణామమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో తెలంగాణ మంత్రులు ఉన్నారని ఏపీలో లేకపోవటం విచారకరమని వ్యాఖ్యానించారు. వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి దేవినేని ఉమాను ఓడించారు వైసీపీ గుర్తుపై గెలుపొందారు. కొడాలి నానిని తప్పించిన తరువాత వసంత కృష్ణప్రసాద్‌కు ఆ స్దానం దక్కుతుందని భావించారు. కాని ఏకంగా కమ్మ సామాజికవర్గానికే క్యాబినెట్లో చోటు లేకుండా చేసారు సీఎం జగన్.

 

 

ఇవి కూడా చదవండి: