Pushpa 2: భారీగా ‘పుష్ప 2’ టికెట్ ధరలు పెంచేందుకు ప్లాన్? – సింగిల్ టికెట్ కాస్ట్ ఎంతంటే..
Pushpa 2 Movie Ticket Rates Hike: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప 2’. ముందు నుంచి ఈ సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత అది మరింత రెట్టింపు అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అంటూ ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో వారందరిని షాకిస్తూ ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదే పుష్ప 2 టికెట్ ధరలు.
ఈ మధ్య పాన్ ఇండియా సినిమాల క్రేజ్‌ను మేకర్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. భారీ బడ్జెట్, బడా హీరో సినిమా అయితే చాలు ఆయా రాష్ట్రాల్లో టికెట్ ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ధరల పెంపుతో పీవీఆర్, ఐనాక్స్, ఐమ్యాక్స్ వంటి మల్టిప్లెక్స్‌లో టికెట్ ధరలు షాకిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా వారికి సపోర్టు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు పుష్ప 2కి కూడా టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా మూవీ టీం సన్నాహాలు చేస్తున్నాయి. ఏ ఇండియన్ మూవీ లేని బజ్ పుష్ప 2 కి కనిపిస్తుంది.
దీనికి ఇటీవల బీహార్ పాట్నాలో జరిగిన ట్రైలర్ ఈవెంట్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమాకు ఏ రేంజ్‌లో హైప్ ఉందో అర్థమైపోతుంది. ఇక దాన్ని క్యాష్ చేసుకునేందుకు మూవీ టీం, థియేటర్ యాజమాన్యాలు చూస్తున్నాయి. దీంతో పుష్ప 2కి టికెట్ ధరలను రెగ్యులర్ రేట్స్ కంటే మరింత ఎక్కువ పెంచాలని చూస్తున్నారట. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్‌లో సింగిల్ టికెట్ ధర దాదాపు రూ. 700 వరకు పెంచనున్నారని టాక్ వినిపిస్తుంది. అలాగే సింగిల్ స్క్రిన్స్‌లో చూస్తే ఒక టికెట్ రూ. 300 పెంచాలని అనుకుంటున్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. అంతేకాకుండా పుష్ప 2 3D వెర్షన్ కూడా రానుంది.
దానికి 3డీ గ్లాసెస్‌చార్జస్ కలిపి అదనంగా రూ. 700 ఉండే అవకాశం ఉందట. సాధారణంగా మల్టీప్లెక్స్‌లో ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలకు రూ. 300 నుంచి రూ. 500 వరకు టికెట్ ధరలను పంచారు. వాటికే సాధారణ ఆడియన్స్ బెంబెలెత్తిపోయారు. ఇప్పుడు పుష్ప 2కి రూ. 700 అని అంతా షాక్ అవుతున్నారు. మరి ఇంతనా అంటూ అంతా నోళ్లు వెళ్లబెడుతుంటే.. ఫ్యాన్స్ మాత్రం ఐకాన్ స్టార్ మూవీ అంటే ఆ రేంజ్ ఉంటుంద కదా అని అంటున్నారు. అయితే పుష్ప 2 టికెట్ ధరల పెంపుపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాబట్టి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియదు. క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.