Hari Hara Veeramallu: సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ – హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది, ఎప్పుడంటే..

Hari Hara Veeramallu Movie Release on world Wide on June 12th 2025: ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఇక ఎండ్ పడింది. ఎట్టకేలకు హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది. మూవీ రిలీజ్ డేట్‌పై తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన సినిమాల షూటింగ్, రిలీజ్ ఎప్పుడనేది స్పష్టత రావడం లేదు. ఎప్పుడు ఏ సినిమా వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తయిన.. సినిమాలోని మార్పుల వల్ల ఈ సినిమా ఎప్పుడస్తుందనేది సంధిగ్ధత నెలకొంది. మే 30న వచ్చే అవకాశం ఉందని రూమర్స్ వినిపించాయి. కానీ అది ప్రచారమే తేలిపోయింది. ఇక వీరమల్లు ఎప్పుడు వస్తాడా? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ తాజాగా మూవీ మేకర్స్ గుడ్‌న్యూస్ చెప్పారు. హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. జూన్ 12న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా వెల్లడించారు. ఇది చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ అంత పండగ చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పవన్ కత్తి పట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో యుద్ధ భూమి, గుర్రాలపై సైనికులు వెళ్తున్నట్టు చూపించారు. వీరమల్లు వచ్చేస్తున్నాడంటూ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. కాగా 16వ శతాబ్ధం బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పవన్ స్వతంత్ర్య సమరయోధుడు వీరమల్లు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా మొదట ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
ఆ తర్వాత ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలను ఏఎమ్ రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నట్టు సమాచారం. కాగా రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా తొలిపార్టు జూన్‌లో ప్రేక్షకుల ముందకు రాబోతుండంలో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
#HariHaraVeeraMallu arrives on June 12, 2025!
![]()
#HHVMonJune12th #VeeraMallu #DharmaBattle #HHVM pic.twitter.com/MQ6602xwF8
— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 16, 2025
ఇవి కూడా చదవండి:
- Hrithik Roshan-Jr NTR: ఎన్టీఆర్ బర్త్‌డే ట్రీట్ – ‘వార్ 2’ సర్ప్రైజ్ లోడింగ్.. తారక్‌పై హృతిక్ క్రేజీ ట్వీట్