పవన్ కళ్యాణ్ తన పిల్లలపై ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు అన్నీ తీసి జనసేన పార్టీ పెట్టాడు : నాగబాబు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యువ రచయిత గణ రాసిన పుస్తకం 'ది రియల్ యోగి'. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యువ రచయిత గణ రాసిన పుస్తకం ‘ది రియల్ యోగి’. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు, దర్శకులు మెహర్ రమేష్, బాబీ కొల్లి, తనికెళ్ళ భరణి, తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లా తాను ఒకరోజైనా ఉండగలనా? అని ఆయనను చూసిన కొన్ని వందలసార్లు అనుకుని ఉంటానని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. పవన్ కళ్యాణ్‌పై గుణ రచించిన ‘ది రియల్ యోగి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ…
పవన్ కళ్యాణ్‌కు అభిమానులు కంటే భక్తులు ఎక్కువ ఉంటారని చెప్పారు. ఆయనపై గుణ రాసిన ది రియల్ యోగి పుస్తకం చాలా బాగుందన్నారు. పవన్ కొంత మందికి చల్లగాలి, మరి కొంతమందికి పిల్లగాలి. ఇంకొంత మందికి ప్రభంజనం అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
నాగబాబు మాట్లాడుతూ…
పవన్ కళ్యాణ్‌లా తాను ఒకరోజైనా ఉండగలనా అని అనుకునేవాడినని అన్నారు. పవన్ పై తనకున్న అభిప్రాయాన్నే గణ తన పుస్తకంలో రాశాడన్నారు. చిన్నప్పటి నుంచి పవన్ కి ఒంటరిగా ఉండేటటు వంటి వ్యక్తిత్వమన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి, పవన్ ఆలోచించే విధానం చాలా తేడావుంటుందన్నారు. తన దగ్గర వున్నది ఇచ్చేయడమే కళ్యాణ్ బాబుకి తెలుసు. కళ్యాణ్ బాబు ఆలోచన ధోరణి చిన్నప్పటి నుండే భిన్నంగా వుండేది. సినిమాలకి రాకముందే కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నావని అన్నయ్య అడిగితే క్యాలిటీగా వుండే సినిమాలు ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చాలు అన్నాడు. తను హీరో అయిన తర్వాత కూడా ఇదే పాటిస్తున్నాడు. ఎదుటి వాడి బాధలో వుంటే తను హాయిగా ఉండలేడు. రుద్రవీణ అన్నయ్య చేసిన సూర్యం పాత్ర రియల్ లైఫ్ లో కళ్యాణ్ బాబుది. సంపాదన నాకు తృప్తిని ఇవ్వడం లేదు. ఎదుటి వాడు బాధలో వుంటే నేను సంతోషంగా ఉండలేను’ అని కామన్ మాన్ ప్రొటక్షన్ ఫోర్స్ పెట్టినపుడే చెప్పాడు.
అప్పుడు ఏం చెప్పాడో ఇప్పుడూ అదే చెబుతున్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే వున్నాడు. మరో నలభై ఏళ్ల తర్వాత కూడా అలానే ఉంటాడు.. దటీజ్.. పవన్ కళ్యాణ్. ఈ సంవత్సరం ఎక్కువ సంపాదించిన హీరో పవన్. అతని తరువాత సంపాదించిన వాళ్ళ దగ్గర వందల కోట్ల ఉంటాయి, కానీ పవన్ దగ్గర ఏమీ వుండవు. అది పవన్ కళ్యాణ్ అంటే… తను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు. లంచగొండి తనంతో సామాన్యుడిని ఇబ్బంది పెడుతున్న రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయడానికి జనసేన పార్టీ పెట్టాడు. పైసా కూడా లేకుండా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడిపోయే వ్యక్తిత్వం కళ్యాణ్ బాబుది. తన భవిష్యత్ గురించి ఆలోచన వుండదు.
తన పిల్లల పై వున్న ఫిక్సడ్ డిపాజిట్లు అన్నీ తీసేసి జనసేన పార్టీ పెట్టాడు. ప్రజలందరికీ పెద్ద ఎత్తున సేవ చేయాలని రాజకీయాన్ని వేదికగా ఎంచుకున్నాడు. తెలుగులో తను టాప్ హీరో. ఫైనాన్సియల్ గా చూస్తే ఏమీ లేదు. కానీ ఒక మనిషిగా ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉంటాడు. పవన్ కళ్యాణ్ టీడీపీ లేదా బీజేపీలోనే, ఏ పార్టీలోనే చేరినా మంత్రి పదవి వచ్చేదన్నారు. అయితే, పదవుల కోసం కాకుండా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని చెప్పారు. పవన్ కళ్యాణ్ క్రేజీ హీరోనే కానీ రాజకీయ నాయకుడైతే కోట్లాది మందికి సహాయం చేయగలనని భావించాడని నాగబాబు తెలిపారు. పవన్ తమ ఇంట్లో పుట్టాడు కాబట్టి అతని గురించి ఎక్కువగా చెప్పలేకపోతున్నాని అన్నారు. పవన్ చాలా విషయాల్లో సఫర్ అయ్యారన్నారు. రేపు ఎలా ఉండాలన్న ఆలోచన్ పవన్‌కు ఉండదన్నారు. మనిషి ఎలా ఉండాలో పవన్ ఉదాహరణ అన్నారు. ప్రస్తుతం వీరు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.