Prabhas: ఆ విషయంలో రాజుగారు చాలా గ్రేట్..

Prabhas: ఇండస్ట్రీలో ఎలాంటి గొడవలు లేకుండా ఉండడం అంటే అది చాలా గొప్ప విషయం. చిత్ర పరిశ్రమలో రూమర్స్ రావడం సహజం. కానీ, అసలు వివాదాలు లేకుండా, ఎలాంటి ప్రైవేట్ పార్టీలకి అటెండ్ అవ్వకుండా.. ఎవరితో మాట్లాడకుండా స్టార్ హీరోగా కొనసాగడం అనేది అసాధ్యం. కానీ, దాన్ని సుసాధ్యం చేసిన ఏకైక హీరో ప్రభాస్. ఇండస్ట్రీకి వచ్చినదగ్గరనుంచి ఇప్పటివరకు డార్లింగ్ మీద ఒక్క వివాదం లేదు. విమర్శలు ఎన్ని ఉన్నా వాటిని ఏరోజు ప్రభాస్ సీరియస్ గా తీసుకున్నది లేదు. ఇక రూమర్స్ విషయానికొస్తే చాలానే ఉన్నాయి. అలాంటివి ఏ హీరో మీదనైనా వస్తూనే ఉంటాయి.
ఇక వివాదాల విషయానికొస్తే.. టాలీవుడ్ లో కుర్ర హీరోలందరూ ఏదో ఒక విధంగా వివాదాల్లో ఇరుక్కుంవారు ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్, మహేష్ బాబు ఇప్పుడు వివాదాలతోనే నడుస్తున్నారు. అందుకు కారణం వారు చేసిన యాడ్స్. ఒక సినిమా హిట్ అయ్యి పేరు వచ్చింది అంటే కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు కమర్షియల్ యాడ్స్ చేయడంతో బిజీ అయిపోతున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ ప్రొడక్స్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారి.. కోట్లు కోట్లు కూడబెడుతున్నారు.
ఇక టాలీవుడ్ లో ఇప్పటివరకు సినిమాలో తప్ప ఒక్క యాడ్ లో కూడా నటించని ఏకైక హీరో ప్రభాస్ రాజు. ఎన్నో బ్రాండ్స్ రాజుగారి ఇంటికి వచ్చీ.. కోట్లు కోట్లు కుమ్మరిస్తాను అన్నా కూడా నో చెప్పాడట. అందుకు కారణం .. ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ, కోట్లు ఇస్తానన్నా వద్దు చేయను అనడం .. ఇప్పుడు ఇలాంటి వివాదాల నుంచి అతడిని దూరం చేసింది. చిరు దగ్గర నుంచి నాని వరకు.. ప్రతి ఒక్క హీరో కూడా ఏదో ఒక యాడ్ లో కనిపిస్తూనే ఉన్నారు.
అంతకుముందు నందమూరి బాలకృష్ణ ఇలాంటి యాడ్స్ కు దూరంగా ఉండేవాడు. కానీ, ఈ మధ్య ఆయన కూడా వరుస యాడ్స్ చేస్తూ ఒకపక్క సినిమాలు, ఇంకోపక్క యాడ్స్ తో రెండు చేతుల సంపాదిస్తున్నాడు. టాలీవుడ్ లో యాడ్స్ ద్వారా హయ్యెస్ట్ పారితోషికం తీసుకుంటున్న హీరో అంటే మహేష్ బాబు అనే చెప్పాలి. ఆ తరువాత నాగార్జున, అల్లు అర్జున్ ఇలా చాలామంది ఉన్నారు. ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోకుండా .. ముందు వెనుకా ఆలోచించకుండా కోట్లు వస్తున్నాయని యాడ్స్ చేస్తున్నారా.. ? అంటే అది నిజం కాదనే చెప్పాలి. కానీ, తమవరకు రాదు అనేది కొందరి దైర్యం అయితే.. వచ్చినా ఏం చేయలేరు అనేది ఇంకొందరి దైర్యం అయ్యి ఉండొచ్చు. కానీ, దీనివలన హీరోల పేరు మార్కెట్ లో పోతుంది అని చెప్పొచ్చు.
యాడ్స్ కు నో చెప్పి రాజుగారు చాలా మంచి పని చేశారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరి నుంచి డార్లింగ్ విజృంభణ మొదలవుతుంది. మరి ఈ సినిమాలతో ప్రభాస్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.