Renu Desai Second Marriage: నా రెండో పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకు..? – రేణు దేశాయ్ ఆగ్రహం!

Renu Desai Response on Media Speculation about her Second Marriage: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లిపై మీడియాలో తరచూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ఓ పాడ్‌కాస్ట్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో స్వయంగా తన రెండో పెళ్లిపై మాట్లాడారు. మీడియా దానినే హైలెట్ చేస్తూ వార్తలు రాసింది. అయితే ఈ ఇంటర్య్వూలో ఆమె ఎన్నో సామాజీకి అంశాలపై మాట్లాడారు. కానీ ప్రతి ఒక్కరు ఆమె రెండో పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా దీనిపై రేణు దేశాయ్ స్పందించారు.
నా రెండో పెళ్లిపై మీకు ఎందుకు అంత ఆసక్తి? అని ప్రశ్నించారు. ఈ మేరకు రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేశారు. హాలో.. “మీడియా పీపుల్ నా రెండో పెళ్లపై ఎక్కువ ఆసక్తిగా ఉన్నారని నాకు అర్థమైంది. నేను గంటకుపైగా ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్య్వూలో ఎన్నో ఉపయోగకరమైన అంశాలపై మాట్లాడాను. సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్స్, మతాలు, సంబంధాలు, ఉమెన్ సేఫ్టి, ఆర్థికాభివృద్ధి వంటి ఎన్నో అంశాలపై మాట్లాడాను. కానీ, మీడియా మాత్రం నా రెండో పెళ్లిపైనే ఫోకస్ పెట్టింది. దానినే హైలెట్ చేస్తూ వార్తలు రాస్తున్నారు.
నా రెండో పెళ్లిపై మీకేందుకు అంతా ఆసక్తి? దీనివల్ల సమాజానికి ఏమైన ఉపయోగం ఉందా? కాబట్టి, మీడియాకు ఓ విన్నపం చేస్తున్నా.. ఈ 44 ఏళ్ల మహిళ రెండో పెళ్లిపై నుంచి మీ దృష్టిని మళ్లీంచి టారిఫ్ శాక్షన్, మహిళా భద్రత, ఆర్థికాభివృద్ధి వంటి సమాజానికి ఉపయోగకపడే అంశాలపై ఆసక్తి పెట్టండి. మీ జర్నలిజం అనుభవాన్ని సమాజంలో ఎదుగుతున్న మహిళా రెండో పెళ్లి కోసం ఉపయోగించకండి. ఇది సమాజానికి, శాంతి భద్రతలకు అంత ఉపయోగపడే అంశం కాదు” అంటూ మీడియాపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.