Home / Nagababu
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పోటీచేసిన 21 స్థానాలు గెలవబోతున్నట్లు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు . అన్ని సర్వేలు, మీడియా సంస్థల నివేదికలు కూటమి అధికారంలోకి రానున్నట్లు చెబుతున్నాయని.. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 కి 21 స్థానాల్లో గెలవబోతున్నట్లు సమాచారం ఉందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు
వైసీపీ డీఎన్ఏ లోనే హింస ఉందని మరోసారి రుజువు అయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని అన్నారు. 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పలువురి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలకు.. కూటమికి చెందిన పలువురు నేతలకు పచ్చ గడ్డి వేస్తే.. భగ్గుమన్న చందంగా మాటలు తూటాల్లో పేలుతున్నాయి. తాజాగా జనసేన నేత నాగబాబు వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటికి వైసీపీ నేతవంగా గీత కౌంటర్ ఇచ్చారు.
2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్దికి, జనసేన పార్టీకి చాలా కీలకమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ నేపధ్యంలో ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జనసైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాస్ఠ్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపుకు అండగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు.
సహజ వనరుల దోపిడీలో వైసీపీ నాయకులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నాయకుల విలువైన క్వార్ట్జ్ లాంటి ఖనిజాలను కొల్లగొడుతున్న తీరు, మైనింగ్ ముసుగులో పేదలను భయాందోళనలకు గురి చేస్తున్న తీరు విస్మయం కలిగిస్తోందన్నారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ నెల 16నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 16వ తేదీ ఉదయం సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
Nagababu: వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. యలమంచిలో జనసేన పార్టీ నూతన కార్యాలయంను ఆయన ప్రారంభించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు, జనసేన నేత నాగబాబుకు పార్టీలో పదోన్నతి ఇచ్చారు. నాగబాబు ఇప్పటి వరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అయితే తాజాగా నాగబాబును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పవన్ ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ ఎన్నారై విభాగం కార్యకలాపాలను కూడా నాగబాబు
అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పాత్రలో నటించి మెప్పించారు వాసుకి. వాసుకీ అలియాస్ పాకీజా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వాసుకీ అనే కంటే కూడా పాకీజా అంటేనే ఎక్కువ మంది గుర్తిస్తారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఎన్నో అద్భతమైన సినిమాల్లో నటించారు.
Nagababu On Alliances: వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తులపై నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో జరుగుతున్న జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన నాగబాబు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కర్నూలులో జనసేన నేతలు.. వీర మహిళలతో నాగబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పొత్తులు కుదిరిన తర్వాతే ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. […]