Anna Lezhneva Properties: వేల కోట్ల అధిపతి.. సింగపూర్,రష్యాలో బిజినెస్‌లు.. పవన్ భార్య అన్నా లెజినోవా గురించి ఈ విషయాలు తెలుసా?

Pawan Kalyan’s wife Anna Lezhneva Background & Assets Details: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రష్యా మోడల్, నటి అయిన ఆమెను పవన్ కళ్యాణ్‌ను 2013లో పెళి చేసుకున్నారు. అప్పటి నుంచి లెజినోవా పవన్ వెన్నంటే ఉంటూ ఆయన సినీ, రాజకీయ జీవితంలో తొడుగా ఉంటున్నారు. ఇటీవల వీరి తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సింగిపూర్‌లో ఓ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డ సంగతి తెలిసిందే.
మార్క్ శంకర్ కోసం తిరుమలలో మొక్కులు
ఈ ప్రమాదం నుంచి కోలుకున్న అతడిని ఇటీవల ఇండియాకు తీసుకుని వచ్చాడు పవన్. ఇక్కడ వచ్చిన ఆమె సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిక తలనీళాలు అర్పించారు. అనంతరం టీటీడీ నిత్యాన్నదానం కోసం ఆమె భారీ విరాళం అందజేవారు. రూ.17 లక్షలు చెక్కును టీటీడీ నిత్యాతన్నదాన అధికారులకు అందజేశారు. ఇక విదేశీయురాలైన ఆమె శ్రీవారిని దర్శించుకోవడం, ఆలయ సాంప్రదాయాలు పాటించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్నా లెజినోవా హాట్ టాపిక్‌గా మారారు.
తీన్‌మార్ మూవీతో పరిచయం
దీంతో ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తులపై అంతా ఆరా తీస్తున్నారు. రష్యా మోడల్, నటి అయిన అన్నా లేజినోవా 1980లో జన్మించారు. అక్కడ నటింగా, మోడల్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమె పవన్ కళ్యాణ్-త్రిష జంటగా నటించిన తీన్‌మార్(2011) సినిమాలో ఈమె అతిథి పాత్ర పోషించారు. అదే సమయంలో పవన్‌కు, ఆమెకు మంచి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో ఇద్దరు రెండేళ్లు సహజీవనం చేశారు. పెళ్లికి ముందే లెజినోవా, పవన్‌కు కూతురు పోలెనా అంజనా పవనోవిచ్ జన్మించింది. దీంతో రేణు దేశాయ్‌కి విడాకులు ఇచ్చి 2013 సెప్టెంబర్ 30 అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్.
సింగపూర్, రష్యాలో లెజినోవాకు బిజినెస్ లు
పెళ్లి తర్వాత ఇండియాలో, ఇటూ రష్యాలో ఉంటూ పిల్లల బాధ్యతలు చూసుకుంటుంది. ప్రస్తుతం ఆమె తన చదువు నేపథ్యంలో సింగిపూర్‌లో ఉంటున్నారు. తన తల్లిదండ్రుల ఆశయం మేరకు సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో మాస్టర్ ఆర్ట్స్ చదువుతోంది. ఇంటర్నేషన్ మీడియా రిపోర్టు ప్రకారం.. లెజినోవా పేరుమీద వందల కోట్ల ఆస్తులు ఉన్నాయట. నటిగా, మోడల్‌గా ఆమె బాగానే ఆస్తులు కూడబెట్టారట. అలాగే రష్యా, సింగిపూర్‌లో రెస్టారెంట్ చైన్ బిజినెస్‌లు ఉన్నట్టు సమాచారం. అవన్ని కలిసి సుమారు రూ. 1800 కోట్ల రూపాయలు స్థిర, చర ఆస్తులు ఉన్నానట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి:
- Mahesh Babu Returns to Hyderabad: వెకేషన్ నుంచి వచ్చిన మహేష్.. ఎయిర్‌పోర్టులో సూపర్‌స్టార్ సందడి!