Akira Nandan Birthday: వీడు ఆరడుగుల బుల్లెట్టూ.. ధైర్యం విసిరిన రాకెట్టూ!

Renu Desai Post on Akira Nandan’s Birthday: టాలీవుడ్ ఇండస్ట్రీ.. కొత్త తరం కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే రోజుకో కొత్త హీరో పుట్టుకొస్తున్నాడు. ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా కూడా అభిమానులు.. వారసుల కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. టాలీవుడ్ లో అలా అభిమానులు ఎదురుచూసే వారసుల్లో మెగా వారసుడు అకీరా నందన్ ఒకడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల పెద్ద కుమారుడు అకీరా నందన్. చిన్నతనం నుంచి కెమెరా కంటికి దూరంగా పెరిగిన అకీరా.. తల్లిచాటు బిడ్డగా మారిపోయాడు. తండ్రి ఇంటిని వదిలినా.. ఏనాడు తండ్రిని మాత్రం వదిలిపెట్టలేదు. పవన్ సైతం.. రేణుకు విడాకులు ఇచ్చినా ఒక తండ్రిగా అకీరాకు ఎలాంటి ప్రేమను పంచాలో అంతే ప్రేమను అందించాడు.
పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. అందరి హీరోల అభిమానులు.. వారివారి హీరోల సినిమాలు రిలీజ్ అయ్యినప్పుడు, పోస్టర్స్, ట్రైలర్స్ రిలీజ్ చేసినప్పుడు హంగామా చేస్తారు. కానీ, పవన్ పాలిటిక్స్ లోకి వెళ్తే.. ఇవన్నీ మిస్ అవుతాం అని వారి బాధను బయటపెట్టారు.
రాజకీయాల్లోకి వచ్చాకా కూడా పవన్ జనసేనకు ఫండ్స్ ఇవ్వడం కోసం సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. దీంతో ఫ్యాన్స్ ఒక మోస్తరుగా ఆనందం వ్యక్తం చేసారు. ఏడాదికి ఒక సినిమా కాకపోయినా.. రెండేళ్లకు ఒక్కసారైనా పవన్ ను పెద్దతెరపై చూడొచ్చు అనుకున్నారు. అయితే పవన్ గతేడాది ఎన్నికల్లో విజయవంతంగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు.
ఇక పవన్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం.. ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి అన్నప్పుడు దిగాడు వారసుడు. తండ్రిని మించిన అందం.. తల్లిని మించిన ఎత్తు.. మెగా తేజస్సుతో అకీరా ఫ్యాన్స్ కంట పడ్డాడు. ఇంకేముంది.. పవన్ లేని లోటు వారసుడు తీరుస్తాడు అని ఫ్యాన్స్ కొత్త ఆనందాన్ని వెతుకున్నారు. ఈమధ్యకాలంలో పవన్ తో పాటు ప్రతి కార్యక్రమంలో అకీరా హాజరయ్యాడు. ఆ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
తండ్రిలానే అన్నింటిలో శిక్షణ తీసుకొని హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు అనుకొనేలోపు రేణు పెద్ద బాంబ్ పేల్చింది. అకీరాకు హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు. తనకు తన కొడుకు సినిమాల్లోకి రావాలని ఉంది. కానీ, అకీరాను బలవంతపెట్టాలనుకోవడం లేదు. ప్రస్తుతం అకీరా మ్యూజిక్ మీద ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నాడు అని చెప్పడంతో ఫ్యాన్స్ నీరుకారిపోయారు. అదేంటండీ అలా అంటారు. మా ఆశలన్నీ చిన్నబాబు మీదనే పెట్టుకుంటే అంటూ మరోసారి ఆవేదన చెందారు.
అయితే.. ఇప్పుడంటే అకీరా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకపోవచ్చు కానీ, భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా తండ్రి బాటలోనే నడుస్తాడు అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. నేటితో అకీరా 20 ఏళ్లు పూర్తి చేసుకొని 21 వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. తాజాగా రేణు.. తన కొడుకుకు ఒక స్పెషల్ ఫోటో షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది.
జలపాతం వద్ద రెడ్ కలర్ స్వేట్టర్ వేసుకొని నిలబడ్డాడు అకీరా. ఆరడుగుల ఎత్తు.. కోల ముఖంతో ఎంతో అందంగా కనిపించాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి పర్ఫెక్ట్ మెటీరియల్ గా ఉన్నా కూడా ఇంకొద్దిగా టైమ్ పట్టేలానే ఉంది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్.. నిజంగా వీడు ఆరడుగుల బుల్లెట్టు.. ధైర్యం విసిరిన రాకెట్టు అంటూ పవన్ పాటను పడేస్తున్నారు. ఈ వారసుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అప్పుడే పవన్ ఫ్యాన్స్ కు హ్యాపీ అని చెప్పొచ్చు.
ఇవి కూడా చదవండి:
- Manoj Compliant on Manchu Vishnu: నా ఇంట్లో దూరి విష్ణు దొంగతనం చేసాడు.. మరోసారి పోలీసులను ఆశ్రయించిన మనోజ్!