Nikhil- Kavya: మేము విడిపోయాం.. దయచేసి మమ్మల్ని కలపకండి

Nikhil- Kavya: ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తాయో ఎవరికీ తెలియదు. ఘాడంగా ప్రేమించుకున్నవారు సడెన్ గా విడిపోతున్నారు. కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని కూడా విడిపోతున్నారు. ఇదేమీ వెండితెరకే పరిమితం కాదు. బుల్లితెరపై కూడా కొన్ని జంటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న జంటల్లో నిఖిల్ – కావ్య ముందు వరసలో ఉంటారు. ఈ జంట మొదట గోరింటాకు అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ఆ సీరియల్ సమయంలోనే వీరి మధ్య పరిచయం.. ప్రేమగా మారింది. ఆ తరువాత ఈ జంట ఒకే ఇంట్లో కలిసి ఉండేది అని కూడా వార్తలు వచ్చాయి. ఇద్దరూ షోస్, ఇంటర్వ్యూస్, యూట్యూబ్ వీడియోలు చేసేవారు. అలా నిఖిల్ – కావ్య ల జంటను చూసి అభిమానులు మురిసిపోయారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, కావ్య , నిఖిల్ ని దూరం పెట్టింది.
ఇక బ్రేకప్ బాధ నుంచి బయటపడటానికి నిఖిల్.. బిగ్ బాస్ సీజన్ 8 కి కంటెస్టెంట్ గా వచ్చాడు.అక్కడ తన ప్రేమాయణాన్ని బయటపెట్టాడు. ఇద్దరం ఘాడంగా ప్రేమించుకున్న మాట వాస్తవమే కానీ, తానే కొన్ని అనరాని మాటలు అనడం వలన కావ్య కోపం గా ఉందని, తనను హౌస్ నుంచి బయటకు వెళ్లి ఎలాగైనా ఆమె కాళ్లు పట్టుకొని అయినా ఒప్పిస్తానని చెప్పుకొచ్చాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక.. కావ్యను కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఆమె అతనితో ఉండడానికి ససేమిరా అని చెప్పింది. ఒక టీవీ షోలో నిఖిల్ ముందే తను సింగిల్ అని, ఇంకెవరిని నమ్మడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పింది.
ఇక దీంతో నిఖిల్ ఒక కఠినమైన నిర్ణయమే తీసుకున్నాడు. ఇక నుంచి కావ్యను డిస్టర్బ్ చేయకూడదు అని డిసైడ్ అయ్యినట్టు తెలుస్తోంది.ఈ మధ్యనే చిన్ని సీరియల్ లో నిఖిల్ – కావ్య కలిసి కనిపించారు. దీంతో అభిమానులు ఈ జంట మళ్లీ కలిసిపోయారని అనుకొని.. సోషల్ మీడియాలో వీరి వీడియోలను ఎడిట్ చేసి.. ట్యాగ్ చేస్తున్నారు. ఇక అభిమానులు చేస్తున్న ఈ వీడియోలపై నిఖిల్ స్పందించాడు. పరిస్థితులు మారిపోయాయి అని , తనను, తన ఫోటోలను ఎవరితో లింక్ చేయొద్దని చెప్పుకొచ్చాడు.
” హలో ఫ్యామిలీ.. మీ అందరి ప్రేమను, ఆప్యాయతను అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. మీరు అందించిన ప్రేమ వలనే నేను ఇక్కడ ఉన్నాను. నేను ఎప్పటికీ మీ ప్రేమను, ఆప్యాయతను మర్చిపోను. కానీ, నాదొక విన్నపం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎవరి జీవితాలు వాళ్లు చూసుకుంటున్నారు. అందులో వారు బిజీగా గడిపేస్తున్నారు. కాబట్టి దయచేసి నన్ను ఎవరితోనూ కలపకండి. ఒంటరిగా నాకు చేయడానికి చాలా పనులు ఉన్నాయి. ఎలాంటి పోస్ట్ లలో కూడా వేరొకరితో కలిసి ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయకండి. ఒక వర్క్ విషయంలో తప్ప పర్సనల్ విషయాల్లో నన్ను కలపకండి. ఇది మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. థ్యాంక్యూ సో మచ్. లవ్ యూ ఆల్” అంటూ రాసుకొచ్చాడు. అంటే ఈ పోస్ట్ తో నిఖిల్ – కావ్య పూర్తిగా విడిపోయారని తెలుస్తోంది. మరి ఈ పోస్ట్ పై కావ్య ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.