Nazriya Nazim: ఫహాద్ కు నజ్రియా విడాకులు.. అతడే కారణమా.. ?

Nazriya Nazim: ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎప్పుడు ఎంతకాలం ఉంటాయో చెప్పడం ఎవరివలన కాదు. గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న స్టార్స్ రెండు మూడేళ్లు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకొని విడిపోతున్నారు. నాగచైతన్య, జయం రవి, ధనుష్, జీవీ ప్రకాష్.. ఇలా స్టార్స్ అందరూ విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో స్టార్ కపుల్ కూడా చేరుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, హీరోయిన్ నజ్రియా నజీమ్ విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో అడోరబుల్ కపుల్ లిస్ట్ తీస్తే టాప్ 5 లోనే ఫహాద్ – నజ్రియా ఉంటారు. అలాంటిది వీరు విడాకులు తీసుకుంటున్నారు అంటూ వస్తున్న వార్తలను నెటిజన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
నజ్రియా నజీమ్ – ఫహద్ ఫాజిల్ బెంగుళూరు డేస్ అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం ప్రేమగా మారి.. ఇరు వర్గాల కుటుంబ సభ్యులను ఒప్పించి 2014 జనవరి 11న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా వీరు కలిసి సినిమాలు చేశారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నజ్రియా గత కొన్ని నెలలుగా అస్సలు కనిపించడం లేదు. గతేడాది ఆమె నటించిన సూక్ష్మదర్శిని సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా సక్సెస్ మీట్ కు కూడా ఆమె అటెండ్ అవ్వలేదు. ఇక ఆమె ఎందుకు సడెన్ గా సోషల్ మీడియాకు దూరమైందా అని అభిమానులు ఆందోళన చెందడం మొదలుపెట్టారు.
రెండు రోజుల క్రితం నజ్రియా ఒక పోస్ట్ పెట్టింది. కొన్ని పర్సనల్ కారణాల వలన తాను సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్లు చెప్పుకోచ్చింది. అయితే ఆ పోస్ట్ తరువాత వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. ఆమె ఎంతో వేదన అనుభవిస్తేనే ఇలాంటి పోస్ట్ పెట్టిందని,కనీసం తన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కలవకుండా ఉండాల్సిన అవసరం ఏముంది అని చెప్పుకొస్తున్నారు. ఇది విడాకుల విషయంలో ఆమె ఎంతో బాధను అనుభవించినట్లు ఉందని చెప్పుకొస్తున్నారు.
ఇక నజ్రియా- ఫహాద్ విడిపోవడానికి ఒక హీరో కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. అతనితో నజ్రియా సన్నిహితంగా ఉంటుందని, దానివల్లనే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయని మలయాళ మీడియా కోడై కూస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో ఆ హీరో ఎవరా.. ? అని ఆరాలు తీస్తున్నారు. మరి ఈ వార్తలపై ఫహాద్ ఎలా స్పందిస్తాడో చూడాలి.