Bobby Simha Car: ప్రముఖ నటుడు బాబీ సింహా కారు భీభత్సం – ఆరు వాహనాలు ధ్వంసం, నలుగురికి గాయాలు

Bobby Simha Car Collides with Six Cars: తెలుగు నటుడు, నేషనల్ అవార్డు విన్నర్ బాబీ సింహా కారు భీభత్సం సృష్టించింది. అతివేగంతో వాహనాలపైకి దూసుకుకెళ్లింది. ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలు కార్లు ధ్వంసం అవ్వగా.. పులువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం ఈ ఘటన కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ మారింది. పోలీసుల సమాచారం ప్రకారం.. నటుడు బాబీ సింహా కారు ఎక్కడుతంగల్ నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు వెళుతుంది. ఈ క్రమంలో అలందూర్ మెట్రో స్టేషన్ వైపు ఉన్న కత్తిపార ప్లైఓవర్ దిగుతుండగా.. కారు అదుపుతప్పి ముందుకు వెళ్తున్న వాహనాలపైకి దూసుకువెళ్లంది. ఈ ఘటనలో ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు సహా ఆరు వాహనాలు దెబ్బతిన్నాయి. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక ద్యాప్తులు తెల్చారు. దీంతో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమంయలో బాబీ సింహా కారులో లేరని సమాచారం. కాగా చిరంజీవి వాల్తేరు వీరయ్య, భారతీయుడు 2, రవితేజ డిస్కో రాజా, రజాకార్ వంటి తదితర చిత్రాల్లో నటించారు.
ఇవి కూడా చదవండి:
- AR Rahman-Abhijeet Bhattacharya: ఎన్ని నిందలు వేసిన ఏం అనుకోను – ఏఆర్ రెహమాన్ షాకింగ్ కామెంట్స్!