Published On:

Actor Santhanam: తిరుమల శ్రీవారికి అవమానం?- వివాదంపై సంతానం స్పందన

Actor Santhanam: తిరుమల శ్రీవారికి అవమానం?- వివాదంపై సంతానం స్పందన

Actor Santhanam Respond on Srinivasa Govinda Song Controversy: శ్రీనివాస్‌ గోవింద పాట తెలియని వారుండరు. అయితే ఈ పాటని పేరడీ చేసి వివాదంలో చిక్కుకున్నాడు కమెడియన్, హీరో సంతానం. అతడు హీరో నటించిన చిత్రం ‘డీడీ నెక్ట్స్‌ లెవల్‌’. మే 16న ఈ సినిమా తమిళ్‌, తెలుగు భాషలో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కిసా 47 పాటను రిలీజ్‌ చేశారు. ఇందులో శ్రీనివాస గోవిందా పాటను పేరడి చేశారు. దీంతో దీనిపై పలు హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.

 

సినిమా కోసం దేవుడి పాటను ఇలా వాడుకోవడం సరికాందంటూ హీరో సంతానం, మూవీ టీంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస గోవిందా పాటను.. పార్కింగ్‌ డబ్బులు గోవిందా.. పాప్‌ కార్న్‌ డబ్బులు గోవిందా అంటూ సినిమా పదాలతో పేరడి చేశారు. ఇది హిందువుల మనోభవాలను దెబ్బతీశారంటూ మూవీ టీంపై తమిళనాడులోని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు ఈ విషయంలో సంతానం, మూవీ టీంపై చర్యు తీసుకోవాలని తమిళనాడులో పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.

 

ఈ పాటను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై సంతానం స్పందించాడు. మూవీ ప్రమోషన్స్‌లో జరిగిన ప్రెస్‌ మీట్‌లో ఈ వివాదంపై సంతానం మాట్లాడాడు. ‘తిరుమల శ్రీవారిని మేం అవమానించలేదని, సెన్సార్ బోర్డు నిబంధనల మేరకు సినిమా తీశామన్నాడు. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుతారని, వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. ఇప్పటికే మూవీ టీంపై పలు పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. మరి సంతానం కామెంట్స్‌తో ఈ వివాదం ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: