Charmi Kaur New Look: షాకిస్తున్న ఛార్మి లేటెస్ట్ లుక్ – మరి ఇంతలా మారిపోయిందేంటి..?

Charmi Shared her Weight loss Photo Instagram: ఛార్మి కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. టాలీవుడ్ అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా నటించి స్టార్ నటిగా గుర్తింపు పొందింది. హోమ్లీగా సంప్రదాయంగా కనిపిపించిన ఆమె జ్యోతిలక్ష్మి చిత్రంలో బోల్డ్ పాత్రలో నటించి షాకిచ్చింది. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తూ ఫ్యాన్స్ అలరించి ఆమె కొన్ని రోజులకు వెండితెరకు దూరమైంది. ఇక నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాత సెటిలైపోయింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో సహా నిర్మాతగా ఉంటూ సినిమాలను నిర్మిస్తోంది.
ప్రస్తుతం నటిగా సినిమాలు పక్కన పెట్టిన ఆమె కాస్తా బొద్దుగా తయారైన సంగతి తెలిసిందే. ఎప్పుడో అప్పుడు మూవీ ఈవెంట్స్, సినిమా సెలబ్రేషన్స్‌కి సంబంధించి పోస్ట్స్ మాత్రమే షేర్ చేసే చార్మి తాజాగా తన లేటెస్ట్ లుక్‌కి సంబంధించిన ఫోటో షేర్ చేసింది. ఇందులో ఆమెని చూసి అంతా షాక్ అవుతున్నారు. మొన్నటి వరకు లావుగా కనిపించిన ఆమె ఈ ఫోటో సన్నగా నాజుగ్గా తయారైంది. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్స్‌ని సర్‌ప్రైజ్‌కి గురి చేస్తుంది. దీనికి ‘తొమ్మిది కిలోలు తగ్గాను.. ఇంకా బరువు తగ్గే పనిలోనే ఉన్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో ఛార్మి తన వింటేజ్ లుక్‌ని గుర్తు చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆమె లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఆమె ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి అంతా అవాక్క్ అవుతున్నారు. ఇదంతా దేనికోసం.. మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా నీ తోడు కావాలి అనే చిత్రంతో ఛార్మీ హీరోయిన్‌గా పరిచయమైంది. మాస్ సినమాతో సూపర్ హిట్‌ను అందుకున్న ఆమె ఆ తర్వాత పౌర్ణమి వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తున్న ఆమె గతేడాది తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఆమె ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టింది.
View this post on Instagram