TTD : ఈ నెల 15 నుంచి తిరుమలలో వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరిస్తాం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

TTD : తిరుమలలో ఈ నెల 15 నుంచి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాణరెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై గురువారం నుంచి బ్రేక్ దర్శనాలు ఉంటాయని తెలిపారు.
ఈ నెల 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు సిఫారసు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు గతంలో టీటీడీ ప్రకటించింది. ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని తెలిపింది. ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని చెప్పింది. వేసవి సెలవుల దృష్ట్యా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ గడువును తగ్గించి ఈ 15 నుంచి ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు స్వీకరిస్తామని మంత్రి ఆనం తెలిపారు.