Published On:

Nagarjuna Akkineni: ఖైరతాబాద్‌లో నాగార్జున సందడి.. లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం ఆర్టీఏ ఆఫీసుకు..

Nagarjuna Akkineni: ఖైరతాబాద్‌లో నాగార్జున సందడి.. లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం ఆర్టీఏ ఆఫీసుకు..

Nagarjuna Akkineni Visits Khairatabad RTA Office: సినీ నటుడు, టాలీవుడ్‌ ‘కింగ్‌’ నాగార్జున అక్కినేని ఖైరతాబాద్‌లో సందడి చేశారు. తన డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ చేయించుకునేంది మంగళవారం ఉదయం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆర్టీఏ కార్యాలయంలో ఫోటోలు దిగి సంతకం చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆర్టీఏ సిబ్బందితో ఆయన సెల్ఫీలు దిగి వారితో కొంత సమయం పాటు సరదాగా మాట్లాడి వెళ్లిపోయారు. ఆర్టీఏ ఆఫీసుకి నాగార్జున వస్తున్న విషయం తెలిసి ఆయనను చూసేందుకు అభిమానుల కార్యాలయానికి భారీగా వెళ్లారు. అక్కడ ఆయనను చూస్తు ఉత్సహం చూపించారు. ఇక ఫ్యాన్స్‌తో కూడా నాగ్‌ ఫోటోలు దిగారు.

 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు ముగిసిందని అంఉదకే రెన్యువల్‌ కోసం వచ్చానని చెప్పారు. ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కుబేరా సినిమాలో నటిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్‌ లీడ్‌ రోల్లో వస్తున్న ఈ సినిమా నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్టు, కుబేరా టైటిల్‌ పాత్ర ఆయన పోషిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న లేటస్ట్‌ మూవీ ‘కూలీ’ మూవీలోనూ ఆయన కీ రోల్‌ పోషిస్తున్నారు. ఇందులో చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర పోషిస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.