Karthi: సీక్వెల్స్ హీరోగా మారిన కార్తీ.. ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా.. ?

Karthi: సీక్వెల్స్.. ప్రస్తుతం ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. కుర్ర హీరో.. సీనియర్ హీరో.. ఎవరైనా సరే.. సినిమా లాస్ట్ లో శుభం అని కాకుండా.. సీక్వెల్ అని ప్రకటిస్తున్నారు. ఆ సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా సరే సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటున్నారు. అయితే టాలీవుడ్ లో సీక్వెల్స్ అచ్చిరాలేదు. రెండు పార్ట్ లుగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ హిట్ అయ్యాయి.
ఇక టాలీవుడ్ గురించి పక్కన పెడితే.. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సీక్వెల్స్ హీరోగా మారాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సీక్వెల్స్ తో కార్తీనే హీరో. ఈ మధ్య రిలీజ్ అయిన హిట్ 3 సినిమా చివర్లో కార్తీని రివిల్ చేశారు. హిట్ 4 కి అతడే హీరో అని చెప్పుకొచ్చారు. ఇక ఇది కాకుండా కార్తీ సినిమాలే సీక్వెల్స్ కి సిద్ధమయ్యాయి. కార్తీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఖాకీ, ఖైదీ సినిమాలు టాప్ 10 లిస్ట్ లో ఉంటాయి.
ఇక ఇప్పుడు వాటి సీక్వెల్స్ లో కూడా ఈ కుర్ర హీరోనే నటిస్తున్నాడు.ఈ రెండు కాకుండా సర్దార్ 2 ఇప్పటికే పట్టలెక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే కార్తీ.. 4 సీక్వెల్స్ లో నటిస్తున్నాడు. ఇక అంతేనా సూర్య హీరోగా నటించిన కంగువ రెండు పార్ట్ లుగా రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.
కంగువ చివర్లో కార్తీని చూపించారు. అన్నదమ్ముల మధ్య యుద్ధం రెండో పార్ట్ లో ఉండబోతుందని ఊరించారు. కానీ, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో సీక్వెల్ తీసే ఆలోచనలో మేకర్స్ లేరని సమాచారం. ఒకవేళ ఇది కూడా లైన్లో ఉంది అంటే ఇది ఐదో సీక్వెల్ అవుతుంది. మరి ఇన్ని సీక్వెల్స్ తో కార్తీ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.