Sobhita Dhulipala: తల్లి కాబోతున్న అక్కినేని కోడలు.. స్పందించిన శోభిత!

Sobhita Dhulipala Reacts on Her Pregnancy Rumours: అక్కినేని హీరో నాగ చైతన్య నుంచి త్వరలోనే గుడ్‌న్యూస్ రాబోతోందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. శోభిత దూళిపాళ ప్రెగ్నెంట్ అని, ఈ టాలీవుడ్ కపుల్ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. టాలీవుడ్ ఓ స్టార్ హీరో తండ్రికాబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే అంతా నాగ చైతన్య అనుకున్నారు. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ అని తేలిపోయింది. దీనిపై మెగా కపుల్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేసారు.
ఇక నాగ చైతన్య-శోభితలు కూడా పెరేంట్స్‌గా ప్రమోట్ అవుతున్నారని, వారి నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ రూమర్స్‌పై అక్కినేని కోడలు శోభిత స్పందించింది. తన ప్రెగ్నెన్సీ రూమర్స్‌ని ఆమె కొట్టిపారేసింది. ఈ మేరకు శోభిత దూళిపాళ టీం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘శోభిత దూళిపాళ ప్రెగ్నెంట్ అంటూ కొద్ది రోజులుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం తను మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితమే నాగ చైతన్య-శోభిత పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఆమె వైవాహిక జీవితాన్ని ఆస్వాధిస్తున్నారు.
కాబట్టి మాతృత్వంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తానికి ఇంకా టైం ఉంది. ప్రస్తుతానికి తన కెరీర్, మ్యారీడ్ లైఫ్‌పైనే ఆమె ఫోకస్ పెట్టారు’ అని శోభిత టీం వెల్లడించింది. దీంతో ఈ రూమర్స్ చెక్ పడింది. కాగా హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య కొంతకాలం సింగిల్‌గా ఉన్నాడు. అదే టైంలో శోభితతో పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లు డేటింగ్ తర్వాత వీరిద్దరు ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లితో బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.