Pawan Joind in OG Set: ఓజీ సెట్‌లో అడుగుపెట్టబోతున్న పవన్ – రేపటి నుంచి పవర్ స్టార్ సందడి

Pawan Kalyan to Re-Join in OG Movie Shooting: పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఏ సినిమా షూటింగ్ ఎప్పుడవుతుందో క్లారిటీ లేక డైలామాలో పడ్డారు. ఈ క్రమంలో ఆయన చిత్రాలకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ వచ్చినా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ వర్క్‌తో పాటు మరిన్ని పనులు మిగిలి ఉన్నాయి.
అవి ఎప్పుడు అయిపోతాయో, వీరమల్లు ఎప్పుడు వస్తాడో.. మేకర్స్ నుంచి ప్రకటన వచ్చేవరకు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక వీరమల్లు సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఓజీ టైం స్టార్ట్ అయ్యింది. నిజానికి పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న మూడు చిత్రాల్లో ఎక్కువ హైప్ ఉంది మాత్రం ఓజీపైనే. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమాలు కావడంతో వీరమల్లు,ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలపై ఆంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే వీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ ఇప్పుడు ఓజీ షూటింగ్‌పై ఫోకస్ పెట్టారట.
వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని మూవీ టీంతో అన్నట్టు తెలుస్తోంది. ఇక నిన్ననే ఓజీ షూటింగ్ మళ్లీ మొదలైన సంగతి తెలిసిందే. దీనిపై స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటన ఇచ్చింది. ‘ఓజీ షూటింగ్ మళ్లీ మొదలైది.. ఈ సారి ముగించేద్దాం’ అంటూ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా ప్రకటన ఇచ్చింది. అయితే ఈ షూటింగ్ పవన్ పాల్గొంటాడా? లేదా? అనే సందేహలు వ్యక్తం అయ్యాయి. అయితే పవన్ నిన్నటి షూటింగ్‌లో పాల్గొనలేదని తెలుస్తోంది. ఆయన రేపటి షెడ్యూల్ నుంచి ఓజీ సెట్‌లో జాయిన్ అవుతారట. ఇందుకు సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇది తెలిసి పవన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక పవన్ సినిమాల జాతర షూరు అంటూ పండగా చేసుకుంటున్నారు. కాగా ఈ మూవీ ముంబై బేస్ గ్యాంగస్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ ఆరుళ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతి కథానాయకుడిగా కనిపించనున్నాడు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.