Anasuya Bharadwaj: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ – గృహప్రవేశం ఫోటోలు చూశారా?

Anchor Anasuya Bharadwaj New Housewarming Ceremony: యాంకర్ అనసూయ భరద్వాజ్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. సంప్రదాయ బద్దంగా, శాస్త్రోక్తంగా జరిగిన గృహప్రవేశం ఫోటోలను తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసింది. అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. తనదైన యాంకరింగ్‌తో ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరిగా ఉన్న మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ నటిగా గుర్తింపు పొందింది. బుల్లితెరపై సందడి చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరిసింది.
ఈ క్రమంలో రంగస్థలం, క్షణం వంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు యాంకరింగ్‌కు గుడ్‌బై చెప్పి నటిగా సెటిలైపోయింది. రంగస్థలం మూవీతో రంగమ్మత్తగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఆమె ఆ తర్వాత పలు చిత్రాల్లో లీడ్ రోల్స్ పోషించింది. చివరిగా పుష్ప 2 సినిమా కనిపించింది. ప్రస్తుతం నటి, రియాలిటీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్న బాగానే సంపాదిస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో మరో కొత్తింటికి కొనుగోలు చేసింది ఈ రంగమ్మత్త. సోమవారం జరిగిన తన నూతన ఇంటి గృహప్రవేశం జరిగింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలను అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాదు ఇంటికి పేరును కూడా వెల్లడించింది. “ఆ సీతారామంజనేయ కృపతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో.. మా జీవితంంలోని మరో ఆధ్యాయం.. శ్రీరామ సంజీవని.. మా కొత్త ఇంటి పేరు. జై శ్రీరామ్.. జై హనుమాన్” అంటూ గృహప్రవేశం ఫోటోలు షేర్ చేసింది. ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు కొద్ది మంది ఇండస్ట్రీవారికి మాత్రమే ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. అనసూయ కొన్న ఈ కొత్త ఇంటి విలువ కోట్లలోనే ఉంటుందని సమాచారం.
View this post on Instagram