Published On:

OG Movie Shooting Resumes: పవన్‌ ఫ్యాన్స్‌ పూనకాలు తెప్పించే అప్‌డేట్.. ఓజీ షూటింగ్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన మేకర్స్‌

OG Movie Shooting Resumes: పవన్‌ ఫ్యాన్స్‌ పూనకాలు తెప్పించే అప్‌డేట్..  ఓజీ షూటింగ్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన మేకర్స్‌

Pawan Kalyan’s  OG Movie Shooting Resumes: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్‌ వచ్చేసింది. వీరమల్లు.. ఓజీ సెట్లో అడుపెట్టాడు. ఇక ముగించేద్దామంటూ తాజాగా మూవీ మేకర్స్‌ గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసింది. కాగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఏపీ ఎన్నికల నేపథ్యంలో తన సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన రాజకీయాల్లో ఉంటున్నారు. ఆ తర్వాత ఆయన పిఠాపురం నుంచి గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతుల చేపట్టారు. దీంతో ఆయన సినిమా షూటింగ్స్‌ తరచూ వాయిదా పడుతూ వస్తున్నాయి.

 

ఈ క్రమంలో ఆయన కమిటైన ప్రాజెక్ట్స్‌ ఎప్పుడు పూర్తవుతాయనేది క్లారిటీ లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. మరోవైపు తన విధిని నిర్వహిస్తున్నారు. ప్రజంల సంక్షేమం చూసుకుంటేనే.. ఓవైపు తను సినిమా షూటింగ్స్‌ మెల్లిమెల్లిగా పూర్తి చేస్తున్నారు. రాజకీయాలతో క్షణం తీరిక లేకున్నప్పటికీ దర్శక-నిర్మాతలకు నష్టం కలిగించకుండ తను కమిటైన ప్రాజెక్ట్స్‌ని పూర్తి చేస్తున్నారు. ఇటీవల వీరమల్లు షూటింగ్‌ పూర్తి చేసిన ఆయన ఇప్పుడు ఓజీ సెట్‌లో అడుగుపెట్టారు. ఈ మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. ఈ మేరకు ఓజీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తాజాగా పోస్ట్‌ షేర్ చేసింది.

 

తాజాగా ఓజీ షూటింగ్‌ సెట్‌లోని ఫోటో షేర్‌ చేసింది నిర్మాణ సంస్థ. దీనికి ‘మళ్లీ మొదలైంది… ఈసారి ముగించేద్దాం’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. అయితే నేటి నుంచి ప్రారంభమైన ఈ షెడ్యూల్‌ పవన్‌ కళ్యాణ్ పాల్గొన్నాడా? లేదా? అనేది క్లారిటీ లేదు. కానీ, ఓజీ షూటింగ్‌ మొదలైందంటూ లేటెస్ట్‌ పోస్టర్‌తో అప్‌డేట్‌ ఇచ్చి ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చింది. దీంతో పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఇక పవన్ సినిమా జాతరే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ఈ సినిమా 70 నుంచి 80 శాతం షూటింగ్‌ పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక ఒక నెల రోజుల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. దీంతో మూవీ షూటింగ్ రీ స్టార్ట్‌ అయ్యిందనే అప్‌డేట్‌ ఇప్పుడు పవన్‌ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.

 

కాగా ఇందులో పవన్‌ కళ్యాణ్‌ గ్యాంగ్‌స్టర్‌ కనిపించనున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పవర్పుల్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్‌, ఎమోసనల్‌గా ఈ మూవీ సాగనుంది. ఇందులో పవన్‌ జోడీగా ప్రియాంక మోహన్‌ ఆరుళ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రీయా రెడ్డిలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సాహో ఫేం సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో సినిమాని నిర్మిస్తున్నారు.