Published On:

AR Rahman-Abhijeet Bhattacharya: ఎన్ని నిందలు వేసిన ఏం అనుకోను – ఏఆర్‌ రెహమాన్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

AR Rahman-Abhijeet Bhattacharya: ఎన్ని నిందలు వేసిన ఏం అనుకోను – ఏఆర్‌ రెహమాన్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

AR Rahman Hit Backs Abhijeet Bhattacharya Comments: గాయకుడు అభిజిత్ తనపై చేసిన విమర్శలపై ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్‌ రెహమాన్‌ స్పందించారు. తనపై ఎన్ని విషయాల్లో తప్పుపట్టిన తాను ఏమి అనుకోని అన్నారు. ప్రతి ఒక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని, దానిని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఏఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ అభిజిత్‌ వ్యాఖ్యలపై ప్రశ్నించారు.

 

“ప్రతి విషయానికి నన్ను తప్పుబట్టడం బాగానే ఉంది. అభిజిత్‌ నాపై ఎలాంటి విమర్శలు చేసినా ఆయనను నేను గౌరవిస్తూనే ఉంటాను. ఆయనంటే నాకేంతో అభిమానం. నా వర్క్‌పై ఉన్న అభిప్రాయాన్ని ఆవిధంగా బయటపెట్టారు. అయినా కూడా నేనేప్పటికీ ఆయనకు అభిమానినే. దానిని నేను ఏమాత్రం తప్పుపట్టను. తన అభిమానంతో ఆయనకు ప్రేమతో స్వీట్స్‌ పంపిస్తాను” అని అన్నారు.

 

కాగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అభిజిత్‌.. మ్యూజిక్‌లో ఏఆర్‌ రెహమాన్‌ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రెహమాన్‌ ఎక్కువగా టెక్నాలజీపైనే ఆధారపడుతున్నారని విమర్శించారు. “గాయనీగాయకలకు బదులు.. టెక్నాలజీని ఉపయోగించి ఆయన మ్యూజిక్‌ కంపోజ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతోమందికి ఉపాధి లేకుండపోతుంది” అని అన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపైనే ఆయన స్పందిస్తూ తాను ఒక మహిళా ఆర్కెస్ట్రా బ్రందాన్ని సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

 

“దుబాయ్‌ వేదికగా ఇటీవల ఒక మహిళా ఆర్కెస్ట్రా బృందాన్ని సిద్దం చేశాను. అందులో సుమారు 60 మంది మహిళలు ఉన్నారు. వారికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి నెల జీతం ఇస్తున్నా. అంతేకాదు వారికోసం ఆరోగ్య, జీవిత భీమా కూడా కడుతున్నాను. పొన్నియిన్‌ సెల్వన్‌, ఛావా వంటి చిత్రాల కోసం వర్క్‌ చేసినప్పుడు సుమారు 200 మంది సంగీతకారులను అందులో భాగం చేశాను. కేవలం పాటల కోసమే 100 మందికి పైగా సింగర్స్‌ వర్క్ చేస్తుంటారు. అయితే ఇందుకు సంబంధించి నేను ఎలాంటి పోస్ట్స్‌, ఫోటోలు షేర్‌ చేయను. కాబట్టి నా వర్కింగ్‌ స్టైల్‌ గురించి పెద్దగా ఎవరికి తెలియదు” అని రెహమాన్‌ వివరణ ఇచ్చారు.