Published On:

Nandamuri Balakrishna: జైలర్ 2 కి బాలయ్య రెమ్యూనరేషన్.. అమ్మ బాబోయ్ అంతా.. ?

Nandamuri Balakrishna: జైలర్ 2 కి బాలయ్య రెమ్యూనరేషన్.. అమ్మ బాబోయ్ అంతా.. ?

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ  ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ ఏడాది డాకు మహారాజ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బుల్లయ్య.. అఖండ 2 తో బిజీగా మారాడు. ఇక ఈ మధ్య బాలయ్య.. కోలీవుడ్ లో ఎక్కువ కనిపిస్తున్నాడు. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2. సూపర్ స్టార్ కెరీర్ లోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ ను మొదలుపెట్టాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.

 

ఇక ఈ సినిమాలో బాలయ్య ఒక క్యామియోలో కనిపిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే క్యామియో కాదని, కొద్దిగా ఎక్కువ నిడివి ఉన్న పాత్రలోనే బాలయ్యను ఫిక్స్ చేసాడట నెల్సన్. దీంతో బాలయ్య, రజినీ కలిసి వస్తే బాక్సాఫీస్ బద్దలు అవ్వడమే అని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పాత్ర ఏదైనా.. ఎంతసేపు ఉన్నా.. రెమ్యూనరేషన్ మాత్రం గట్టిగానే తీసుకుంటున్నారు సెలబ్రిటీస్. బాలయ్య కూడా అందుకు మినహాయింపు కాదు.

 

తాజాగా జైలర్ 2 కి బాలయ్య గట్టిగానే అందుకున్నాడని టాక్ నడుస్తోంది. అలా వచ్చి ఇలా పోయే క్యామియో అయితే రజినీతో ఉన్న స్నేహం కోసం ఫ్రీగా చేసేవాడేమో కానీ.. కీలక పాత్ర  కావడంతో గట్టిగానే డిమాండ్ చేసాడని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం.. జైలర్ 2 కు బాలయ్య.. రూ. 50 కోట్లు ముట్టజెప్పారట. ఏంటి.. కొద్దిసేపు పాత్రకు అంతా.. ? అని అంటే. బాలయ్య మార్కెట్ అంతే మరి.

 

అందులోనూ ఈ మధ్య బాలయ్య పద్మభూషణ్ కూడా అందుకున్నాడు. ఇలా అన్ని కలిసి రావడంతో ఆయన మార్కెట్ పెరిగింది. దీంతో బాలయ్యకు ఎంత ఇచ్చిన తక్కువే అనుకున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాల్సి ఉంది. ఎంత ఇచ్చినా.. సినిమా హిట్ అయితే.. ఆ లాభమే ఇంతకన్నా ఎక్కువే వస్తుంది. మరి ఈ సినిమాతో బాలయ్య తమిళ్ లో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి: