Published On:

Ram Charan Wax Statue: రామ్‌ చరణ్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా గుర్తింపు

Ram Charan Wax Statue: రామ్‌ చరణ్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా గుర్తింపు

Ram Charan Wax Statue Record in London: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మరో అరుదైన ఘనత సాధించాడు. లండన్‌లో చరణ్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూని ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం చరణ్‌ మైనపు విగ్రహాన్ని మే 10న ఆవిష్కరించింది. ఈ సందర్భంగా చరణ్‌ కుటుంబ సమేతంగా లండన్‌ వెళ్లాడు. తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసనతో పాటు కూతురు క్లింకార.. అలాగే తన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి ఈ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ చరణ్‌కు అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. కాగా కొన్ని రోజుల క్రితం మ్యూజియం నిర్వాహకులు స్వయంగా హైదరాబాద్‌ వచ్చి చరణ్‌ కొలతను తీసుకుని వెళ్లారు.

 

మైనపు విగ్రహంలో చరణ్‌తో పాటు అతడి పెంపుడు కుక్క రైమ్‌ కూడా ఉంది. ఇక లండన్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసిన తొలి భారతీయ నటుడిగా విగ్రహంగా చరణ్‌ స్టాట్చ్యూ కావడం విశేషం. దీంతో చరణ్‌ చరణ్‌ అరుదైన ఘనత సాధించాడు. కాగా ఇదే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం.. గతంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ విగ్రాహన్ని సింగపూర్‌లో.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ విగ్రహాన్ని దుబాయ్‌లో మ్యూజియంలో ఆవిష్కరించింది. ఇప్పుడు రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహాన్ని లండన్‌లో ఏర్పాటు చేయడంతో ఆయనకు కూడా ఈ గౌరవం దక్కింది. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు రామ్‌ చరణ్‌. ఈ సినిమా తర్వాత చరణ్‌ నటించి గేమ్‌ ఛేంజర్‌ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

 

ప్రస్తుతం ఆయన ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది మూవీ చేస్తున్నాడు. స్పోర్డ్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇటీవల చరణ్‌ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌కి ఆడియన్స్‌ నుంచి విశేష ఆదరణ అందుతుంది. ముఖ్యంగా ఇందులో చరణ్‌ పెద్ది షాట్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇందులో చరణ్‌ క్రికెట్ కోచ్‌గా కనిపించనున్నాడని టాక్‌. ఈ సినిమాలో కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు జగపతి బాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా థియేటర్లోకి రానుందని సమాచారం.

ఇవి కూడా చదవండి: