Kantara Actor Died: ఇండస్ట్రీలో విషాదం.. కాంతార నటుడు మృతి

Kantara Prequel actor Rakesh Poojary Died: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు రాకేష్ పూజారి(34) కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. గుండెపోటుతో రాకేష్ మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యాడని, మహెందీ వేడుకలో ఈ విషాదం జరిగిన కన్నడ మీడియాలో పేర్కొన్నారు.
కాగా కన్నడలోని ప్రముఖ రియాలిటీ షో కిలాడిగలుతో మంచి స్టార్ డమ్ అందబుకున్నారు రాకేష్ పూజారి. తనదైన ఆటతో ఈ షోలో సీజన్-3 విన్నర్‌గా నిలిచాడు. అంతేకాదు బుల్లితెరపై పలు షోలో పాల్గొని ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో కాంతారకు ప్రీక్వెల్‌గా వస్తున్న కాంతార: చాప్టర్ వన్‌లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. అంతలోనే రాకేష్ పూజారి గుండెపోటుతో మరణించి తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో కన్నడ బుల్లితెర నటీనటులు, కాంతార కాస్ట్ రాకేష్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్స్ షేర్ చేస్తున్నారు.
Always with a pure sweet hearted smile , ever loving , and extremely talented artist , you will always remain in our heart , deeply saddened , Rakesh we miss you! pic.twitter.com/Qx9Tx0bOOT
— Pruthvi Ambaar (@AmbarPruthvi) May 12, 2025