Pakistan : భారత్‌పై పాక్ దాడికి సిద్ధం?.. ప్రతిచర్యకు అనుమతి ఇచ్చిన పాక్ ప్రధాని

Pakistan : పహల్గాం ఉగ్రదాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులకు పాల్పడింది. దాడుల్లో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ దాడి నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. ఇండియాపై ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
భారత్‌పై ప్రతిచర్యకు పాక్ ప్రధాని షెహబా షరీఫ్ ఆర్మీ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు పాక్ మీడియా డాన్ తెలిపింది. దీంతో భారత్–పాక్ మధ్య యుద్ధం జరగబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందు ఇండియా దాడుల నేపథ్యంలో ఆర్మీ ఉన్నతాధికారులతో పాక్ ప్రధాని అత్యవసరంగా భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై చర్చించినట్లు తెలిసింది.
మరోవైపు యుద్ధం నెలకొంటే పాక్‌ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఇండియా సన్నద్ధం అవుతోంది. ప్రధాని మోదీ కొన్ని రోజులుగా త్రివిధ దళాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. మరోవైపు ఇవాళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.