LIK Movie Release Date: ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. రిలీజ్ డేట్ ప్రకటించిన నయనతార!

Pradeep Ranganathan LIK Movie Release Date Announced: ‘లవ్‌టుడే’ ఫేం ప్రథీప్ రంగనాథ్ హీరోగా నయనతార నిర్మాతగా.. ఆమె భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎల్‌ఐకే'(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని నయనతార ప్రకటించింది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. లవ్‌టుడే, డ్రాగన్ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్లు అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్.
దీంతో ఆయన మూడో చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సెప్టెంబర్ 18న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియోను బాగా ఆకట్టుకుంటుంది. అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత హైప్ పెంచుతోంది. భారీ బడ్జెట్‌తో టైమ్ ట్రావెలర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషలో ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ కోసం ముబైల్ గాడ్జెట్‌ను ఉపయోగించి 2035 వరకు టైమ్ ట్రావెల్ చేసే వ్యక్తి పాత్రలో ప్రదీప్ రంగనాథన్ కనిపించనున్నాడు. ఈ సినిమా ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ సమర్పణలో నయనతారతో పాటు పలువురు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటుంది.
ఇవి కూడా చదవండి:
- NTR – YVS Chowdary Movie: నందమూరి ఇంటి నుంచి మరో హీరో ఎంట్రీ.. ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభోత్సవం!