Published On:

Prakash Raj: ఇమేజ్‌ బిల్డ్‌ కోసం ప్రచార మంత్రి ఏమైనా చేస్తాడు – ప్రధాని మోదీపై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన కామెంట్స్‌

Prakash Raj: ఇమేజ్‌ బిల్డ్‌ కోసం ప్రచార మంత్రి ఏమైనా చేస్తాడు – ప్రధాని మోదీపై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన కామెంట్స్‌

Prakash Raj Sensational Tweet: ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రకాశ్‌ రాజ్‌ ఓ సంచలన పోస్ట్‌ పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ పరోక్ష కామెంట్స్‌ చేశారు. ప్రచార మంత్రి అంటూ మోదీని ఎద్దేవ చేశారు. ప్రస్తుతం ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

 

ఆయన ట్వీట్‌ చేస్తూ.. “నాకు తెలిసి ప్రచార మంత్రి ఇమేజ్‌ బిడ్డింగ్‌ కోసం ఏమైనా చేస్తారు. మీరు ఏమంటారు ప్రజలారా?” అని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా పులి తొలు ఆరబెట్టిన చర్మం, కింద నక్క ఫోటోని షేర్‌ చేశారు. ఇది పులి తొలు కప్పుకున్న నక్క అని అర్థం వచ్చేలా ఉంది. దీనికి జస్ట్‌సెయింగ్‌ (#justsaying) అనే హ్యాష్‌ ట్యాగ్‌ని జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన ప్రధాని మోదీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు.

 

ఇక దీనిపై నెటిజన్స్‌ నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతో మోదీకి సపోర్టు ఇస్తూ ప్రకాశ్‌ రాజ్‌ను విమర్శిస్తున్నారు. మా ఎన్నికలు కూడా గెలవలేని ప్రకాశ్‌ రాజ్‌ ప్రసంగాలు చేస్తున్నాడంటూ వెటికరిస్తున్నారు. కాగా ప్రకాశ్‌ రాజ్‌ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ నటుడైన ఆయన రాజకీయాలపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. సామాజంలో సంఘటనలను ఉద్దేశిస్తూ మోదీని ప్రశ్నిస్తుంటారు. ఈ క్రమంలో ఇండియా-పాకిస్తాన్‌ యుద్దం తరుణంలో ప్రకాశ్‌ రాజ్‌ మోదీ తీరుపై పరోక్షంగా విమర్శలు చేయడంతో ఆయన కామెంట్స్‌ చర్చనీయాంశమయ్యాయి.