Alia Bhatt: ప్రతి సైనికుడి త్యాగం వెనుక ఎంతోమంది తల్లుల కడుపుకోత – ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్

Alia Bhatt Pens Heartfelt Note to Indian Soldiers: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్-పాకిస్తాన్ వార్ ఇలా కొన్ని రోజులుగా దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ప్రతి రోజు రాత్రి జమ్మూకశ్మీర్‌లో డ్రోన్, బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై సాధారణ ప్రజల నుంచి సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో తామంత భారత్ సైన్యం వెంటనే ఉన్నామంటూ భారత రక్షణ దళాలకు మద్దతు ఇస్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తున్నారు.
అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. మనం ప్రశాంతగా నిద్రపోతున్నామంటే.. అక్కడ బార్డర్‌లో మెలవుకుతో ఉండి తన ప్రాణాలను అడ్డుపెడుతున్న ఎంతో సైనికులు త్యాగమే అంటూ ఆలియా ఇండియా-పాకిస్తాన్ వార్‌పై స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది. ‘గత కొన్ని రాత్రులుగా భిన్నమైన అనుభవం కలుగుతోంది. దేశమంత ఊపిరి బిగబట్టిప్పుడు గాల్లో ఓ విధమైన నిశ్చలత్వం. గత కొన్ని రోజులుగా మనం అదే నిశ్చలత్వాన్ని ఫీల్ అవుతున్నాం. ఈ ప్రతి సంభాషణ, ప్రతి సంభాషణ, ప్రతి నోటిఫికేషన్, ప్రతి డిన్నర్ టెబుల్ వెనక ఈ ఆందోళనలతో కొట్టకునే నాడులు ఎన్నో ఉన్నాయి. పర్వతాలలో ఎక్కడో, మన సైనికులు మెలకువతో అప్రమత్తంగా.. ప్రమాదంలో ఉన్నారని తలచుకుంటుంటే చాలా భారంగా అనిపిస్తుంది.
మనం ఇళ్లలో నిద్రపోతున్నామంటే బోర్డర్‌లో మన సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, వారి అంతులేని త్యాగం. అలాగే ఈ ప్రతి సైనికుడి యూనిఫాం వెనుక నిద్రపోని ఎంతోమంది తల్లులు ఉన్నారు. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని.. అనిశ్చితి.. ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైన బద్దలు కావోచ్చు. కానీ ప్రతి రాత్రి ఆ తల్లికి తెలుసు. ఇటీవలే మనమంతా మదర్స్ డే జరుపుకున్నాం. ఆలింగనం చేసుకున్నాం. ఆ రోజు దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులను కనిపెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను.
ఆ తల్లిదండ్రుల ధైర్యం ఈ దేశాన్ని ఎంతగానో కదిలిస్తోంది. పంటి బిగువున బాధను నొక్కిపెట్టిన వారికి ప్రతిక్షణం అండగా ఉంటాం. మా రక్షకుల కోసం ఈ దేశం కోసం కలిసి నిలబడతాం. జైహింద్” అంటూ ఆమె రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆలియా పోస్ట్ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. మేమంత సైన్యం వెంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతనెల 22న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే. అందుకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట ఈ ఉగ్రవాద చర్యను తిప్పి కొట్టింది. ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి 100 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది.
View this post on Instagram