Formula E-Race: హైదరాబాదులో ఫార్ములా ఈ -రేస్ రద్దు
హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ రద్దు అయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు.
Formula E-Race: హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ రద్దు అయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు. అక్టోబర్ 30, 2023న సంతకం చేసిన హోస్ట్ సిటీ ఒప్పందాన్ని నెరవేర్చకూడదని తెలంగాణ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (MAUD) నిర్ణయం తీసుకోవడంతో ఈవెంట్ రద్దయినట్లు వారు చెప్పారు.
ఫార్ములా E సహ-వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఛాంపియన్షిప్ అధికారి అల్బెర్టో లాంగో మాట్లాడుతూ, భారత్‌లో భారీ మోటార్‌స్పోర్ట్ అభిమానుల కోసం మేము చాలా నిరాశకు గురయ్యాము. అధికారిక మోటార్‌స్పోర్ట్ ప్రపంచ ఛాంపియన్షిప్ రేసును నిర్వహించడం హైదరాబాద్‌కు మరియు మొత్తానికి ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన సందర్భమని మాకు తెలుసు. దురదృష్టవశాత్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అలా జరగడం లేదని అన్నారు. ఫార్ములా E సీఈవోజెఫ్ డాడ్స్ మాట్లాడుతూ గత సంవత్సరం ప్రారంభమయిన రేసును మేము కొనసాగించలేకపోవడం చాలా నిరాశపరిచింది. ఇది ఈ ప్రాంతానికి దాదాపు 84 మిలియన్ డాలర్ల సానుకూల ఆర్థిక ప్రభావాన్ని అందించిందని అన్నారు.
తిరోగమన చర్యలకు నిదర్శనం..(Formula E-Race)
ఫార్ములా ఈ రేసింగ్ రద్దు కావడంపై స్పందిస్తూ..కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన చర్యలకు నిదర్శనం అని విమర్శించారు. ఈ రేస్ లాంటి కార్యక్రమాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి, దేశానికి పెట్టుబడులు, కీర్తి వస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాయన్నారు. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ను ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించడంతో.. స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.