Published On:

Samantha: కొత్త బాయ్ ఫ్రెండ్ ని వదలని సామ్.. అక్కడికి కూడా.. ?

Samantha: కొత్త బాయ్ ఫ్రెండ్ ని వదలని సామ్.. అక్కడికి కూడా.. ?

Samantha:  గత కొన్నేళ్లుగా సామ్.. బాలీవుడ్ దర్శక  ద్వయం రాజ్ అండ్ డీకే లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్ లతో బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ గా పేరు తెచ్చుకున్నారు రాజ్ అండ్ డీకే. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సామ్.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. దీనిలో ఉన్న ఇంటిమేటెడ్ సీన్స్ వలనే.. సామ్, అక్కినేని కుటుంబానికి దూరమయ్యిందని వార్తలు కూడా వచ్చాయి.

 

ఇక ఈ సిరీస్ తరువాతనే అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చింది. ఆ సమయంలోనే రాజ్- సమంత మధ్య పరిచయం ప్రేమకు దారితీసిందని అంటున్నారు. చైతో విడాకులు అనంతరం కొన్నేళ్లు సైలెంట్ గా ఉన్న సామ్.. ఈ మధ్యనే బయటకు వస్తుంది. బయట కనిపించినప్పుడల్లా వీరిద్దరూ కలిసే కనిపిస్తుండడంతో వీరి ప్రేమాయణం నిజమే అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మొన్నటికి మొన్న తిరుమలలో సామ్ తో పాటు రాజ్ కూడా కనిపించాడు. ఆ తరువాత సామ్ కొత్త జర్నీ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో కూడా రాజ్ ఉన్నాడు.

 

ఇక ఈ మధ్యనే  సామ్..  తన మొట్ట మొదటి ప్రాజెక్ట్ శుభం ను రిలీజ్ చేసింది. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రీయా కొంతం, చరణ్ పేరి ప్రధాన పాత్రలుగానటిస్తున్న  ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించిన  ఈ సినిమా మే 9 న ప్రేక్షకుల ముందుకు  మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రతి ప్రమోషన్స్ లో కూడా రాజ్ ను ఇన్వాల్వ్ చేస్తుంది సామ్.  శుభం సినిమా సక్సెస్ అందుకున్నా కూడా ప్రమోషన్స్ ఆపలేదు సామ్.

 

తాజాగా శుభం టీమ్ మొత్తం కలిసి ఒక వీడియో చేశారు. ఇందులో నటుడు వంశీధర్ తన బేస్ వాయిస్ తో.. సమంత గురించి, శుభం సినిమా గురించి చెప్పుకొచ్చాడు. సామ్.. ఏ మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అన్న దగ్గరనుంచి శుభం సినిమాకు నిర్మాతగా మారిందని చెప్పుకొచ్చాడు. ఇక మధ్యలో రాజ్ గురించి చెప్పుకొచ్చాడు.

 

ఇక ఈ సినిమాలో బాగా హిట్ అయిన జన్మజన్మల బంధం సాంగ్ వెనుక ఒక పెద్ద క్రియేటివ్ హెడ్ ఉన్నాడు. ఆయన ఎవరికి కనిపించడు అని చెప్పగానే.. కెమెరా రాజ్ దగ్గర వచ్చి ఆగింది. సామ్ తో సహా అందరూ హాయ్ సర్ అని చెప్పుకొచ్చారు. ఇలా సామ్.. రాజ్ ని కెమెరా కంటికి కనిపించేలా చేస్తుంది. వీరిద్దరూ ప్రస్తుతం కలిసే ఉంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలి.

ఇవి కూడా చదవండి: