Sravan Rao : అఖండ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.6కోట్లు మోసం.. చీటింగ్ కేసులో శ్రవణ్‌రావు అరెస్టు

Sravan Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావుపై సీసీఎస్‌లో చీటింగ్ కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించారు. గతంలో అఖండ ఎంటర్‌ప్రైజెస్‌కు శ్రవణ్‌రావు రూ.6కోట్లు మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో శ్రవణ్‌రావును హాజరు పరిచేందుకు తరలించారు.
ఫోన్ ట్యాపింగ్ సమయంలో రెండు సెల్ ఫోన్లు..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్‌కు గురైన ఫోన్ నంబర్లు వాటిని ప్రణీత్‌రావు టీంకు పంపించిన మొబైల్ ఫోన్ నంబర్ల ఆధారంగా ట్యాపింగ్‌లో శ్రవణ్‌రావు పాత్రను సిట్ అధికారులు గుర్తించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఆధారంగా ఫోన్ నంబర్లతో లింకు అయిన ఐఎంఈఐ నంబర్లు గుర్తించారు. వీటిలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రవణ్‌రావు నంబర్ నుంచి వెళ్లిన వాట్సాప్ చాటింగ్‌లు, ప్రణీత్‌రావుకు ఆయన పంపించిన మొబైల్ నంబర్లను గుర్తించి శ్రవణ్‌రావుపై సిట్ కేసు నమోదు చేసింది.