Published On:

Doctor arrest in Drug Case: డ్రగ్స్‌కు బానిసైన డాక్టరమ్మ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

Doctor arrest in Drug Case: డ్రగ్స్‌కు బానిసైన డాక్టరమ్మ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

Doctor arrested Drug Case in Hyderabad: ప్రజలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చెప్పాల్సిన ఓ వైద్యురాలు తప్పుడు మార్గంలో వెళ్లింది. సదరు వైద్యురాలు డ్రగ్స్‌కు బానిస అయ్యింది. నిషేధిత కొకైన్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కింది. దీంతో వైద్యురాలిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 

పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఏపీఏహెచ్‌సీ కాలనీకి చెందిన డాక్డర్ చిగురుపాటి నమ్రత(34) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. కొన్నేళ్లగా ఆమె డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మత్తు పదార్థాలకు బానిస అయ్యింది. ఈ సందర్భంగా ముంబయిలో నివాసముండే వాన్స్ టక్కర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించారు. అనంతరం రూ.5లక్షల కొకైన్ డ్రగ్స్ ఆర్డర్ చేసింది. డబ్బులను ఆన్‌లైన్ ద్వారా పంపింది.

 

అనంతరం టక్కర్ తన వద్ద డెలివరీ బాయ్‌గా పనిచేసే బాలకృష్ణ రాంప్యార్ రామ్(38)కు డ్రగ్స్ ఇచ్చి హైదరాబాద్‌కు పంపించారు. రాయదుర్గంలో వైద్యురాలు నమ్రతను కలిసి అతడు డ్రగ్స్‌ను ఇస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద 53గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి: