Last Updated:

YS Sharmila: కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల

వైఎస్ షర్మిల బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.

YS Sharmila: కాంగ్రెస్ లో చేరిన  వైఎస్ షర్మిల

YS Sharmila: వైఎస్ షర్మిల బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. వైఎస్సార్ జీవితం అంతా కాంగ్రెస్ కోసమే పనిచేశారని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని కొనియాడారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్లే.. మణిపూర్లో అల్లర్లు జరిగాయన్నారు.

మా నాన్న కల..(YS Sharmila)

రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం మా నాన్న కల అని షర్మిల అన్నారు. రాహుల్ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందిన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే తమ పార్టీ తెలంగాణలో పోటీ చేయలేదని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అటువంటి పార్టీలో చేరినందుకు గర్వపడుతున్నానని షర్మిల చెప్పారు.