Road Accident on HYD ORR: విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు సజీవ దహనం

3 Dead in Road Accident at Hyderabad Outer Ring Road: తెలంగాణలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని అబ్ధుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధరాత్రి కారు.. ఎదురుగా ఆగి ఉన్న బొలెరోను బలంగా ఢీకొట్టింది. అయితే బొలెరో వాహనాన్ని వెనుకనుంచి వేగంగా ఢీకొట్టడంతో కారు ముందుభాగం ఇరుక్కుపోయింది. కారులో ఇరుక్కున్న ముగ్గురిని బయటకు తీస్తుండగా మంటలు చెలరేగాయి. బొలెరో డ్రైవర్ ఒకరిని కాపాడగా.. మరో ఇద్దరు మంటల్లో సజీవ దహనమయ్యారు. బయటకు తీసిన ఒకరిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇవి కూడా చదవండి:
- Pawan Rs 50 Lakhs to Murali Nayak Family: వీరజవాన్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కల్యాణ్