Published On:

Ketika Sharma: హమ్మయ్య.. రొమాంటిక్ భామ హిట్ కొట్టిందిరోయ్

Ketika Sharma: హమ్మయ్య.. రొమాంటిక్ భామ హిట్ కొట్టిందిరోయ్

Ketika Sharma: డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు టాలీవుడ్ స్టార్స్ గా ఎదిగిన విషయం తెల్సిందే. ఇక పూరి పరిచయం చేసిన హీరోయిన్స్ లో కేతిక శర్మ ఒకరు. పూరి కొడుకు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో కేతిక తెలుగు ఎంట్రీ ఇచ్చింది. అమ్మడి అందానికి తెలుగు ఫ్యాన్స్  ఫిదా అయ్యారు. ముద్దుగా, బొద్దుగా ఉన్న కేతికను చూసి.. అబ్బా ఈ పాప స్టార్ హీరోయిన్ గా మారుతుంది అనుకున్నారు.

 

రొమాంటిక్ సినిమా కనుక హిట్ అయితే అమ్మడి రేంజ్ వేరేలా ఉండేది. కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. రొమాంటిక్ సినిమా రిలీజ్ కాకముందే కేతిక వరుస ఆఫర్స్ ను పట్టేసింది. కానీ, కేతిక లక్ ఏంటో కానీ.. అవకాశాలు వచ్చాయి కానీ.. విజయాలను అందుకోలేకపోయింది. ఇక సినిమాలు లాభం లేదని.. ఐటెంగర్ల్ గా కూడా మారింది. రాబిన్ హుడ్ సినిమాలో వాడిదా సర్ ప్రైజ్ అంటూరెచ్చిపోయింది.

 

ఇక ఆ సినిమా హిట్ కాకపోయినా.. అమ్మడి అందానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.  ఇన్నేళ్ల ఎదురుచూపులా తరువాత కేతిక మొదటి సారి సింగిల్ సినిమాతో హిట్ అందుకుంది. శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సింగిల్ మూవీ మే 9 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

 

ఇక ఈ సినిమాలో పూర్వగా కేతిక నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక సింగిల్ సినిమా.. రోజురోజుకు రికార్డ్ కలక్షన్స్ అందుకుంటుంది. ఈ సినిమాతో అమ్మడికి మంచి హిట్ పడింది. ఇక సింగిల్ తరువాత అయినా.. కేతికకు వరుస అవకాశాలు తలుపుతట్టి విజయాల బాట పడుతుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి: