Published On:

Nandamuri Balakrishna: బాలయ్యను ఇంప్రెస్‌ చేసిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ డైరెక్టర్‌ –  క్రేజీ కాంబో సెట్‌ అయినట్టే..!

Nandamuri Balakrishna: బాలయ్యను ఇంప్రెస్‌ చేసిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ డైరెక్టర్‌ –  క్రేజీ కాంబో సెట్‌ అయినట్టే..!

Nandamuri Balakrishna Next Movie With Good bad Ugly Director: గాడ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్‌ టూ బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. అఖండ మూవీ నుంచి బాలయ్య వరసగా నాలుగు బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. వరుస హిట్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఆయన వరుసగా ప్రాజెక్ట్స్‌కి లైన్‌లో పెడుతున్నాడు. ప్రస్తుతం ‘అఖండ 2’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఆయన సినీ ప్రస్థానం గతేడాది 50 ఏళ్లు ముగిసింది.

 

ఇలా వరుసగా బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్‌ అందుతున్నాయి. వరుస సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఆయన ఓ తమిళ డైరెక్టర్‌ని లైన్లో పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అజిత్‌తో సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ అదిక్‌ రవిచంద్రన్‌తో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అదిక్‌ రవిచందర్‌ బాలయ్య కోసం అదిరిపోయే స్క్రిప్ట్‌ ప్లాన్‌ చేశాడని, ఇప్పటికే ఆయనకు స్టోరీ లైన్‌ కూడా చెప్పినట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

ఇక బాలయ్యకు అదిక్‌ చెప్పిన స్క్రిప్ట్‌కి ఇంప్రెస్‌ అయినట్టు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.. ఆల్మోస్ట్‌ అదిక్‌ బాలయ్య ఒకే చెప్పినట్టే అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్ర టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఓ క్రేజీ కాంబో సెట్‌ అయినట్టే అని చెప్పాలి. బాలయ్యతో సినిమా అంటే అదిక్‌ అది తెలుగులో అదిరిపోయే ఎంట్రీ అవుతుందనడంతో సందేహం లేదు. ఇక ఆయనను సరికొత్తగా తెలుగు ప్రేక్షకులు పరిచయం చేయడానికి ఇది అదిక్‌ అత్యత్తుమ ఛాన్స్‌ అనుకోవాలి. మరి ఈ కాంబ్‌ సెట్‌ అయ్యిందా? లేదా అని తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి: