Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్ పల్లి, మియాపూర్, ప్రగతినగర్, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మాసాపేట, జగద్గిరిగుట్టలో భారీగా వర్షం పడుతుంది. కాగా కొద్దిరోజులుగా ఎండలతో అల్లాడుతున్న ప్రజలు వర్షాలకు వాతావరణం చల్లబడటంతో కొంత ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు వర్షం కొన్ని ప్రాంతాల్లో చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.