Last Updated:

Hyderabad: హైదరాబాద్: ఫోర్జరీ కేసులో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ అరెస్ట్

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్‌కి చెందిన ఇంటిని ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలివి.

Hyderabad: హైదరాబాద్:  ఫోర్జరీ కేసులో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ అరెస్ట్

 Hyderabad: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్‌కి చెందిన ఇంటిని ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలివి.

నకిలీ పత్రాలతో..( Hyderabad)

ఐఎఎస్ అధికారి భన్వర్ లాల్ బేగంపేటలోని తన ఇంటిని ఓర్సు సాంబశివరావు (53)కి అద్దెకు ఇచ్చారు. సాంబశివరావు తన భార్య ఒర్సు రూప డింపుల్ (53)తో కలిసి అక్కడ నివసిస్తున్నాడు. ఐదేళ్ల రెంటల్ అగ్రిమెంట్ ముగిసినప్పటికీ వారు ఖాళీ చేయలేదు. తరువాత ఆ ఇంట్లోకి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ చేరాడు. అతను సాంబశివరావు దంపతులతో కలిసి ఇంటిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో నకిలీ పత్రాలు సృష్టించాడని భన్వర్ లాల్ నవంబర్ 17న పోలీసులకు ఫిర్యాదు చేసారు.దీనితో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి ఈ డాక్యుమెంట్లు ఫేక్ అని తేల్చారు. డిసెంబర్ 22న సాంబశివరావు దంవతులను అరెస్ట్ చేసారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ కుమార్ అజ్జాతంలోకి వెళ్లిపోయాడు. చివరకు బుధవారం నాడు పోలీసుల చేతికి చిక్కాడు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీ జాయింట్ డైరక్టర్ గా ఉన్న నవీన్ కుమార్ గతంలో వికారాబాద్ ఎస్పీగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డీసీపీగా పనిచేసాడు.

మరోవైపు నవీన్ కుమార్ అరెస్టును బీసీ సంక్షేమ సంఘం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఖండించింది. బీసీ అయిన నవీన్‌కుమార్‌కు పదోన్నతి కల్పించకుండా పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారని, అగ్రవర్ణ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి భన్వర్‌లాల్‌తో కుమ్మక్కై అతన్ని అరెస్టు చేశారని కూడా ఆరోపించింది.అరెస్ట్ చేసిన అధికారిని వెంటనే విడుదల చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం హెచ్చరించింది.